చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లతో ఆడిపాడిన స్టార్ హీరోయిన్ శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే!

Published : Apr 23, 2021, 03:11 PM IST

80-90లలో హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది నటి శోభన. ప్రొఫెషనల్ గా భరతనాట్య డాన్సర్ అయిన శోభన, తెలుగు, మలయాళ బాషలలో కలిపి వందకు పైగా చిత్రాలలో నటించారు.   

PREV
18
చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లతో ఆడిపాడిన స్టార్ హీరోయిన్ శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే!
అప్పటి స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ తో సూపర్ హిట్ మూవీస్ లో ఆమె నటించారు. చిరంజీవికి జంటగా ఆమె నటించిన అల్లుడు గారు, రుద్రవీణ వంటి చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి.

Photo courtesty: love spell signature

28
కుటుంబ వారసత్వంగా వచ్చిన భరతనాట్యం ప్రొఫెషన్ ఆమె సినిమా కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది. సాంగ్స్ లో శోభన డాన్స్ అద్భుతం అని చెప్పాలి. చిరంజీవి వంటి బెస్ట్ డాన్సర్స్ తో శోభన స్టెప్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేవి.

Photo courtesty: love spell signature

38
స్టార్ హీరోయిన్ గా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ తో పాటు హిందీ, ఇంగ్లీష్ లో కూడా శోభన చిత్రాలు చేశారు.  ఇంత గొప్ప స్టార్డం అనుభవించిన శోభన మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఓ సందర్భంలో శోభనను పెళ్లి గురించి అడిగితే ఈ విధంగా స్పందించారు.

Photo courtesty: love spell signature

48
నేను నా వ్యక్తిగత జీవితం గురించి పంచుకోవడానికి రాలేదు.  అయితే నేను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే.. సింగల్ గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాగుంది.

Photo courtesty: love spell signature

58
కేవలం పెళ్లి మాత్రమే సంతోషం ఇస్తుంది అనుకుంటే.. అది పొరపాటే. చాలా మంది పెళ్లే సంతోషానికి పరమావధి అనుకుంటారు. అలాంటి వారి గురించి ఆలోచిస్తే నాకు జాలేస్తుంది.  పెళ్లి కంటే కూడా జీవితంలో సంతోషం పంచే విషయాలు చాలా ఉంటాయి. అది మన ఎంపికపై ఆధారపడి ఉంటుంది... అంటూ శోభన సమాధానం చెప్పారు.

Photo courtesty: love spell signature

68
51ఏళ్ల ప్రాయానికి చేరుకున్న శోభన, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది. కేరళలో రాజవంశంగా చెప్పుకొనే ట్రావెన్ కోర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే శోభన. హీరో వినీత్ శోభనకు రెలెటివ్ అవుతారు.

Photo courtesty: love spell signature

78
పెళ్లి చేసుకోకపోయినా ఓ పాపను దత్తత తీసుకుంది శోభన. 2001లో ఆమె ఆడపిల్లను దత్తత తీసుకోవడంతో పాటు ఆమెకు అనంత నారాయణి అని పేరు పెట్టారు.

Photo courtesty: love spell signature

88
ఇక ప్రస్తుతం శోభన డాన్స్ క్లాస్ లలో శిక్షణ ఇస్తూ జీవిస్తున్నారు.

Photo courtesty: love spell signature

click me!