వర్ష-ఇమ్మానియేల్ బయటికి వెళ్ళాక ఏమి చేస్తారో ఎవరికీ తెలియదు!

First Published Jan 24, 2021, 3:18 PM IST

జబర్ధస్త్ షో కొత్త ప్రేమ జంట ఇమ్మానియేల్, వర్ష ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నారు. నల్లగా ఉండే ఇమ్మానియేల్ కి తెల్లగా ఉండే వర్షకు మధ్య ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా క్లిక్ అయ్యింది. 
 

వీరిద్దరూ కెవ్వు కార్తీక్ టీమ్ లో చేస్తుండగా... స్కిట్స్ కూడా వీరి ప్రేమ కహాని చుట్టే తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న స్కిట్స్ కి మంచి వ్యూస్ దక్కుతున్నట్లు సమాచారం.
undefined
ప్రతి స్కిట్ లో ఇమ్మానియేల్ పై పడిపోతూ, వెంటపడుతూ వర్ష నటనలో జీవించేస్తుంది. అయితే ఇది కేవలం నటన కాదని వీరి మధ్య నిజంగానే ప్రేమ కథ నడుస్తుందని కొన్ని వార్తలు రావడం జరిగింది.
undefined
జబర్ధస్త్ బిగినింగ్ నుండి ఉన్న సీనియర్ కమెడియన్ అదిరే అభి ఈ విషయంపై స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.
undefined
జబర్ధస్త్ లో రష్మీ-సుధీర్ లవ్ స్టోరీ ఎప్పటి నుండో నడుస్తుంది. కొత్తగా వర్ష-ఇమ్మానియేల్ అనే కొత్త జంట వచ్చి చేరారు. నిజానికి ఈ రెండు జంటల మధ్య ఉన్న బంధం ఏమిటని అడగడం జరిగింది.
undefined
దీనికి సమాధానంగా అదిరే అభి... రష్మీ-సుధీర్ మంచి స్నేహితులు మాత్రమే వాళ్ళ మధ్య ఏమీ లేదు. వర్ష-ఇమ్మానియేల్ గురించి మాత్రం నాకు తెలియదు.  ఎందుకంటే వాళ్ళతో నాకు పెద్దగా అనుబంధం ఉండదు.
undefined
సెట్ లో షూట్ అయిపోయాక ఎవరి దారి వారిది. వర్ష- ఇమ్మానియేల్ సెట్స్ నుండి బయటికి వెళ్ళాక ఏమి చేస్తారో ఎవరికీ తెలియదు అని అదిరే అభి అన్నాడు.
undefined
వాళ్ళ మధ్య నిజంగా ప్రేమ ఉండవచ్చు లేకపోవచ్చు. ఉన్నా, లేక పోయినా...  ఉన్నట్లు నటిస్తారు. దాని వలన జనాలు వారి గురించి మాట్లాడుకుంటారు.
undefined
అది వాళ్లకు మరియు చేసే స్కిట్స్ కి పాపులారిటీ తెస్తుందని అభి అసలు విషయం బయటపెట్టాడు.
undefined
click me!