సస్పెన్స్, యాక్షన్, ఎమోషన్.. ఈ వీకెండ్ ఓటీటీ ట్రీట్ రెడీ!

Published : Aug 30, 2025, 07:17 PM IST

OTT releases this week: ఈ వీకెండ్ ను మరింత స్పెషల్ గా మార్చడానికి ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామాలు, బయోపిక్స్, థ్రిల్లర్లు, సూపర్ హీరో మూవీస్ రాబోతున్నాయి. ఆ బెస్ట్ సినిమాలెంటో ఓ లుక్కేయండి.    

PREV
18
వీకెండ్ లో OTTహంగామా

OTT releases this week: ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డిజిటల్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు ఓటీటీలో కొత్త సినిమాలు ప్రత్యేక్షం కానున్నాయి. . ఇందులో క్రైమ్, స్పై, సస్పెన్స్, రొమాంటిక్ థ్రిల్లర్‌తో పాటు ఓ మలయాళ ఫ్యామిలీ డ్రామా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంతకీ వీకెండ్ ఎంటర్టైన్ మెంట్ కోసం పర్ఫెక్ట్‌ ఛాయిస్ గా నిలిచే ఆ సినిమాలెంటో ఓ లుక్కేయండి.

28
మెట్రో... ఇన్ డినో (Netflix)

అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన మెట్రో... ఇన్ డినో (Metro... In Dino)రొమాంటిక్ డ్రామా. ఇది 2007లో విడుదలైన లైఫ్ ఇన్ ఎ... మెట్రో కి రీమేక్. ఈ రొమాంటిక్ డ్రామాలో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, కపూర్, ఫాతిమా సనా షేక్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ డ్రామా “మెట్రో ఇన్ దినో” ఆగస్టు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతోంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఏకంగా రూ.78 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ రొమాంటిక్ డ్రామాను తప్పక చూడండి.

38
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (Amazon Prime Video)

బాలీవుడ్ నటి సబా ఆజాద్ నటించిన మూవీ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (Songs of Paradise). కశ్మీర్ దిగ్గజ గాయని రాజ్ బేగం జీవితంపై ఆధారంగా తెరకెక్కిన రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా ఇది. డానిష్ రెంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీ పిక్చర్స్, రెంజు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. సోనీ రజ్దాన్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ కానున్నది.

48
అటామిక్ (Disney+ Hotstar )

అటామిక్ (Atomic)అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఆగస్టు 29 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ కథ విషయానికి వస్తే.. స్మగ్లర్ మాక్స్, మరో వ్యక్తి యురేనియం స్మగ్లింగ్‌లో ఇరుక్కుపోయే సస్పెన్స్ థ్రిల్లర్. అండర్‌వర్డ్ స్మగ్లింగ్‌, న్యూక్లియర్ సీక్రెట్స్‌, డేంజరస్ సైంటిస్ట్, రహస్య ఏజెంట్‌తో జరిగే గేమ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ స్పెన్స్ థ్రిల్లర్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ ఆగస్టు 29 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

58
లవ్ అన్‌టాంగిల్డ్ (Netflix)

కొరియన్ రొమాంటిక్ డ్రామా ‘లవ్ అన్‌టాంగిల్డ్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ ఆగస్ట్ 29 నుంచి ఓటీటీలో ప్రత్యేక్షం కానున్నది. ఓ యువతి తన ఉంగరాల జుట్టును సిల్కీగా మార్చుకోవాలనే చిన్న కోరికతో మొదలయ్యే కథ, ఆమె ప్రేమలో పడినప్పుడు ఎదురయ్యే భావోద్వేగాల ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రానికి నామ్ కూంగ్ సన్ దర్శకత్వం వహించగా, గాంగ్ మ్యుంగ్, షిన్ యున్ సూ, చా వూ-మిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. యవ్వనంలో ప్రేమలో పడితే ఎదుర్కొనే కష్టాలు, మధురమైన జ్ఞాపకాలు, హార్ట్ టచ్చింగ్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

68
కింగ్‌డమ్ (Netflix)

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా సినిమా “కింగ్డమ్” (KINGDOM). ఈ తెలుగు స్పై యాక్షన్ మూవీ డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించబోతోంది. జులై 31న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇక ఈ నెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. యాక్షన్‌, ఎమోషన్‌, బ్రదర్‌హుడ్‌ ఎలిమెంట్స్‌తో నిండిన “కింగ్డమ్” థియేటర్స్‌లో బజ్ క్రియేట్ చేసినట్లే, ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుందని అంచనా.

78
శోధ వెబ్ సిరీస్ – మిస్టరీ థ్రిల్లర్

కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ “శోధ” ఆగస్టు 29 నుంచి జీ5 (ZEE5)ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సునీల్ మైసూర్ దర్శకత్వం వహించిన ఈ ఒరిజినల్ సిరీస్‌లో రోహిత్ లీడ్ రోల్ పోషించగా, అరుణ్ సాగర్, సిరి రవికుమార్, అనూష రంగనాథ్, దియా హెగ్డే తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కానీ అందరూ అతని భార్య పక్కనే ఉందని చెబుతారు. అయితే అతను మాత్రం ఆమె తన భార్య కాదని అంటాడు. ఇలా మొదలైన ఈ సంఘటనలు హీరోను కుట్ర, ప్రాణాపాయం, మిస్టరీలలోకి నెట్టేస్తాయి. ఇంతకీ అతని భార్య ఎవరు? కుట్ర వెనుక ఉన్నది ఎవరు? అనేది శోధ సిరీస్‌. ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లతో ఈ థ్రిల్లర్ ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయం.

88
4.5 గ్యాంగ్ (SonyLIV)

మలయాళంలో రియల్ లైఫ్ ఆధారంగా వచ్చిన డార్క్ కామెడీ సిరీస్ “4.5 గ్యాంగ్” (4.5 Gang). స్లమ్ ఏరియాలో పెరిగిన నలుగురు యువకులు తమ గౌరవం పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రియల్ లైఫ్ స్టోరీస్ ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్‌కు క్రిషాంద్ దర్శకత్వం వహించారు. 

ఈ మూవీలో జగదీష్, ఇంద్రన్స్, విజయ రాఘవన్, హకీం షా, దర్శన రాజేంద్రన్, సంజు శివరామ్, శాంతి బాలచంద్రన్, నిరంజ్ మణియన్ పిళ్లై, శ్రీనాథ్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సోనీ లివ్ లో ఆగస్టు 29 నుంచి మలయాళం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories