అక్కినేని నాగార్జున శుక్రవారం రోజు తన 66వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, సెలెబ్రిటీలు నాగార్జునకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు అందాయి. నాగార్జున చివరగా రజినీకాంత్ కూలీ, ధనుష్ కుబేర చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.