Pritam And Pedro
అర్షద్ వార్సీ, వీర్ హిరానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ Pritam And Pedro. పాత పద్ధతుల్లో కేసులు ఛేదించే అనుభవజ్ఞుడైన పోలీస్, టెక్నాలజీపై ఆధారపడే యువ పోలీస్ కలిసి నేరాలను ఛేదించే కథతో ఈ సిరీస్ రూపొందింది.
ఎక్కడ చూడాలి: JioHotstar
రిలీజ్ డేట్: జూలై 3
Mollywood Times
Premalu ఫేమ్ నస్లెన్ గఫూర్ హీరోగా నటించిన Mollywood Times చిత్రానికి అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించారు. మలయాళ సినీ పరిశ్రమను కాపాడేందుకు గొప్ప హారర్ దర్శకుడిగా మారాలని కలలు కనే యువకుడి కథను ఈ చిత్రం చూపిస్తుంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ సినిమా ఇప్పుడు OTTలోకి వస్తోంది.
ఎక్కడ చూడాలి: JioHotstar
రిలీజ్ డేట్: జూలై 3
Tavvai
Tavvai హిందీ హారర్ చిత్రం. పిత్ర దోషం, దైవ విముక్తి, లక్ష్మి-అలక్ష్మి మధ్య జరిగే పురాణ పోరాటం వంటి అంశాల చుట్టూ కథ సాగుతుంది. అర్పిత్ రంకా, మనోజ్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎక్కడ చూడాలి: JioHotstar
రిలీజ్ డేట్: జూన్ 29
Juhi Mui
Bigg Boss 18 ఫేమ్ ఈషా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన Juhi Mui ఒక డైలీ సోప్. ఆటిజంతో బాధపడుతున్న ప్రతిభావంతురాలు తన సోదరుడి సహాయంతో న్యాయవాదిగా మారి నేరస్థులను చట్టం ముందుకు తీసుకురావడం ఈ కథలో ప్రధానాంశం.
ఎక్కడ చూడాలి: JioHotstar
రిలీజ్ డేట్: జూన్ 29