
ఇప్పుడు థియేటర్లలో ఏ సినిమా రిలీజ్ అవుతుందనే ఆసక్తికంటే ఓటీటీలో ఏ ఏ సినిమాలు వస్తున్నాయి. ఏ వెబ్ సిరీస్‌లు వస్తున్నాయనే ఆసక్తినే ఆడియెన్స్ లో ఎక్కువగా ఉంది. ఇంట్లో కూర్చొని హాయిగా చూడొచ్చు అనే ఫీలింగ్ ఏర్పడింది. మరి ఈ వారం ఓటీటీలోకి వస్తోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటనేది చూస్తే, తెలుగు ఆడియెన్స్ పండగ చేసుకునే సినిమాలు రాబోతున్నాయి. రవితేజ, విశ్వక్ సేన్ మూవీస్ ఈ వారమే ఓటీటీలోకి వస్తున్నాయి.
ఈ వారం ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రం రాబోతుంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజకి జోడీగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా, కామెడీ ప్రధానంగా ఈ చిత్రం రూపొందింది. సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశ పరిచింది. ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఈ నెల 13న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి చాలా లేట్‌గా ఓటీటీ డీల్ సెట్ అయ్యింది. అందుకే లేట్‌గా ఓటీటీలోకి వస్తోంది.
ఈ వారమే రాబోతున్న మరో తెలుగు సినిమా `ఫంకీ`. ఇది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదలైంది. అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 13నే నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. అనుదీప్ లవర్స్ కి పండగే అని చెప్పొచ్చు.
మార్చి 12న `నవాబ్ కేఫ్` మూవీ రిలీజ్ కాబోతుంది. శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా రూపొందింది. వారసత్వంగా వచ్చిన ఛాయ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈటీవీ విన్ లో ఈ నెల 12న స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ వారమే ఓటీటీలో ఒక టీవీ షో కూడా స్టార్ట్ కాబోతుంది. జీయో హాట్ స్టార్‌లో `మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్` అనే కొత్త షో ప్రారంభం కానుంది. పది జంటలు, పది వారాలు ఒకే ఇంట్లో ఉంటారు. వీరంతా లవర్స్. ఈ పది వారాలు తమ రిలేషన్ ఎంత బలంగా, నమ్మకంగా, ప్రేమతో ఉందని, కష్టాల్లోనూ ప్రేమ కోసం ఎలా నిలబడతారని తెలియజేసేలా సాగబోతుంది. అనిల్ రావిపూడి, రాధ, లయ జడ్జ్ లుగా వ్వవహరిస్తున్న ఈ షో ఈ నెల 15 నుంచి జీయో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
పైన రాబోతున్న తెలుగు చిత్రాలతో, షోతోపాటు ఇతర భాషల చిత్రాలు, సిరీస్‌లు కూడా ఈ వారం రాబోతున్నాయి. అవేంటో చూస్తే, ప్రేమికుల రోజు సందర్భంగా తమిళంలో విడుదలైన `పూకీ` అనే చిత్రం ఇప్పుడు మార్చి 13 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అజయ్ దిశన్, ఆర్కే ధనుష జంటగా నటించారు. ఇది థియేటర్లో ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. దీంతోపాటు ప్రియాంక అరుల్ మోహన్ నటించిన `మేడ్ ఇన్ కొరియా`. విలేజ్ కామెడీ డ్రామాగా సాగే ఈ మూవీ మార్చి 12 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి రా కార్తీక్ దర్శకత్వం వహించారు. దునియా విజయ్ నటించిన కన్నడ మూవీ `ల్యాండ్‌లార్డ్` కూడా ఈ వారమే వస్తోంది. జీ 5లో మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఇది రూపొందింది. మరో తమిళ చిత్రం `నాంగల్` మార్చి 13న సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి అవినాష్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. గుజరాతీ మూవీ `నాంఖతై` అనే మూవీ మార్చి 12న షేమరో మీ అనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. `ది తాజ్ స్టోరీ` అనే హిందీ ఫిల్మ్ మార్చి 13న లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమింగ్ కానుండగా, `ది మేడిసన్` అనే ఇంగ్లీష్ ఫిల్మ్ మార్చి 15న జియో హాట్ స్టార్‌లో, `ది ఫ్యామిలీ మెక్ ములెన్` అనే ఇంగ్లీష్ మూవీ మార్చి 15న జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆంధ్ర ప్యార్ 2.0(హిందీ) -మార్చి 14
ఆస్పిరెంట్ సీజన్ 3(హిందీ)- మార్చి 13
సంకల్ప్(హిందీ)-మార్చి 11(అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్)
స్కార్పెట్టా(ఇంగ్లీష్)-మార్చి 11
హ్యారీ స్టైల్స్, వన్ నైట్ ఇన్ మాంచెస్టర్(ఇంగ్లీష్)-మార్చి 9
వన్ పీస్ సీజన్ 2(ఇంగ్లీష్)-మార్చి 10
వర్జిన్ రివర్ సీజన్ 7(ఇంగ్లీష్)-మార్చి 12
ఫాటల్ సెడక్షన్ సీజన్ 3(ఇంగ్లీష్)-మార్చి 13
దట్ నైట్(స్పానిష్)-మార్చి 13
ఏజ్ ఆఫ్ ఎట్రాక్షన్(ఇంగ్లీష్)-మార్చి 11
రీసార్ట్ (తమిళం)-మార్చి 13
రూస్టర్(ఇంగ్లీష్)-మార్చి 9
ది సోసైటీ సీజన్ 2(హిందీ)-మార్చి 9(రియాలిటీ షో)
జూటోపియా 2(ఇంగ్లీష్)-మార్చి 13