ఎవరినీ పిలవకుండా నాగ చైతన్య నిశ్చితార్థం హడావుడిగా ఎందుకు చేశారో తెలుసా? ఆ రహస్యం వెలుగులోకి!

First Published | Aug 11, 2024, 7:15 AM IST

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ అత్యంత నిరాడంబరంగా, ఎవరినీ పిలవకుండా ముగించారు. అందుకు కారణం ఎమిటో స్వయంగా నాగార్జున బయటపెట్టారు. 
 

Naga Chaitanya-Sobhita Dhulipala


అక్కినేని హీరో నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. వీరిద్దరూ రెండేళ్లకు పైగా రిలేషన్ లో ఉన్నారు. సమంతతో విడాకులు అనంతరం నాగ చైతన్య-శోభిత ఎఫైర్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. 

నాగ చైతన్య టీం శోభితతో ఎఫైర్ రూమర్స్ ఖండించడం విశేషం. శోభిత సైతం ఈ వార్తలను తోసిపుచ్చింది. నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఈ పుకార్లపై స్పందించాల్సిన అవసరం లేదు, అని ఆమె అన్నారు. కానీ నాగ చైతన్యతో ఆమె కలిసి ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఆగస్టు 8న నాగ చైతన్య-శోభిత నిశ్చితార్థం జరుపుకున్నారు. అనంతరం నాగార్జున ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. శోభితకు తన కుటుంబంలోకి ఆహ్వానం పలికారు. శోభిత-నాగ చైతన్య కలకాలం సుఖ సంతోషాలతో హాయిగా కలిసి జీవించాలని కోరుకున్నారు. 

కాగా నాగ చైతన్య-శోభిత ల నిశ్చితార్థకం వేడుక అత్యంత నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. హడావుడిగా ముగించిన భావన కలిగింది. అంత పెద్ద ఫ్యామిలీ వేడుక ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించకుండా ముగించడం చర్చకు దారి తీసింది. ఈ విషయంపై నాగార్జున స్వయంగా స్పందించారు. 

ఆగస్టు 8న మంచి ముహూర్తం కుదిరింది. అందుకే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ హడావుడిగా నిర్వహించాల్సి వచ్చింది. శోభిత-నాగ చైతన్య వివాహం చేసుకోవాలని ధృడంగా నిశ్చయించుకున్నారు. వారి జాతకాల ఆధారంగా గొప్ప ముహూర్తం దొరికింది. అందుకే నిరాడంబరంగా, అప్పటికప్పుడు నిశ్చితార్థం వేడుక జరపాల్సి వచ్చింది, అన్నారు. 

కాబట్టి అందరూ అనుకున్నట్లు నాగ చైతన్యకు ఇది రెండో వివాహం కావడం వలన ఎంగేజ్మెంట్ ఘనంగా చేయలేదు అనేది నిజం కాదు. తక్కువ సమయంలో ముహూర్తం కుదిరిందట. మంచి ముహూర్తం కోల్పోకూడదని హడావుడిగా నిర్వహించారట. పెళ్ళికి మాత్రం కొంత సమయం ఉందని నాగార్జున అన్నారు. 

Latest Videos

click me!