Anasuya Bharadwaj: వాళ్ళ వలనే జబర్దస్త్ కి దూరం అయ్యాను... ఎట్టకేలకు అసలు నిజం చెప్పిన స్టార్ యాంకర్!

Published : Mar 28, 2024, 01:51 PM ISTUpdated : Mar 28, 2024, 04:21 PM IST

అనసూయ జబర్దస్త్ మానేసి దాదాపు రెండేళ్లు కావస్తుంది. అందుకు కారణాలు ఏమిటనేది ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు అనసూయ ఆ సీక్రెట్ బయటపెట్టింది.   

PREV
17
Anasuya Bharadwaj: వాళ్ళ వలనే జబర్దస్త్ కి దూరం అయ్యాను... ఎట్టకేలకు అసలు నిజం చెప్పిన స్టార్ యాంకర్!
Anasuya Bharadwaj

అనసూయ అంటే జబర్దస్త్... జబర్దస్త్ అంటే అనసూయ. ఆమె జీవితాన్ని మార్చేసిన షో అది. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ అనే కామెడీ షో స్టార్ట్ చేశారు. కొందరు కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా మారారు.  జడ్జెస్ రోజా, నాగబాబు సారథ్యంలో జబర్దస్త్ ప్రారంభం అయ్యింది. 

 

27
Anasuya Bharadwaj

ఊహించిన దానికంటే జబర్దస్త్ సక్సెస్ అయ్యింది. వ్యక్తిగత కారణాలతో అనసూయ షో నుండి తప్పుకుంది. దాంతో రష్మీ గౌతమ్ కి ఛాన్స్ దక్కింది. ఆమె దశ కూడా ఈ షో మార్చేసింది. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ జబర్దస్త్ కి అనుసంధానంగా మరో షో స్టార్ట్ చేశారు. అప్పుడు అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది. 

37
Jabardasth Anasuya Bharadwaj

అనసూయ ట్రెండ్ సెట్టర్ అనాలి. అప్పటి వరకు బుల్లితెరపై పొట్టి బట్టలు వేసిన తెలుగు యాంకర్స్ లేరు. అనసూయతో ఈ సాంప్రదాయం మొదలైంది. ఈ విషయంలో విమర్శలు వచ్చినా అనసూయ తగ్గలేదు. పైగా నా బట్టలు నా ఇష్టం అంటూ ప్రశ్నించిన వారికి కౌంటర్లు ఇచ్చింది. యాంకర్ గా చేస్తూనే నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది. 

 

47
Jabardasth Anasuya Bharadwaj

కాగా 2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. అనసూయ కు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ ని వదిలేయడానికి కారణాలు ఏంటనే సందేహాలు అందరిలో ఉన్నాయి. గతంలో అనసూయ అస్పష్టంగా స్పందించింది. ఈసారి పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయకు ఈ ప్రశ్న ఎదురైంది. 

57

జబర్దస్త్ నుండి మీరు వెళ్లిపోయారా? లేక వాళ్ళు తీసేశారా? అని అడగ్గా... నన్ను ఎవరైనా తీసేస్తారా? నేనే మానేశాను. దానికి కారణం ఆ సమయంలో నేను మూడు తెలుగు సినిమాలు, మూడు తమిళ సినిమాలు చేస్తున్నాను. బిజీ షెడ్యూల్స్. నా కారణంగా మిగతా కమెడియన్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఈవెంట్స్ షెడ్యూల్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. 


 

67
Jabardasth Anasuya Bharadwaj

మన కారణంగా ఇతరులు ఇబ్బంది పడటం ఎందుకని నేనే జబర్దస్త్ మానేశాను. మల్లెమాల సంస్థతో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పటికి కొన్ని ప్రపోజల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటామని... ఆమె అన్నారు. కేవలం నటిగా ఆమె బిజీ కావడం వలన జబర్దస్త్ మానేసినట్లు అనసూయ వెల్లడించింది. 

77
Jabardasth Anasuya Bharadwaj

గతంలో అనసూయ... టీఆర్పీ స్టంట్స్ నచ్చడం లేదని, జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడుతున్నారని, నటిగా యాంకర్ గా కొనసాగుతుంటే ప్రేక్షకులు కన్ఫ్యూస్ అవుతున్నారని కొన్ని కారణాలు చెప్పడం కొసమెరుపు. 
 

Read more Photos on
click me!

Recommended Stories