బిగ్‌ బాస్‌ లో శివాజీకి అన్యాయం, అసలు విన్నర్‌ అతనేనా? ఆ కామెంట్లపై నోరు విప్పిన శివన్న

First Published | Sep 18, 2024, 4:36 PM IST

హీరో శివాజీ గత సీజన్‌ బిగ్‌ బాస్‌ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే తనకు అన్యాయం జరిగిందంటూ షాకిచ్చాడు శివన్నా. ఎట్టకేలకు ఆయన దీనిపై నోరు విప్పారు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు హాట్‌ హాట్‌ కామెంట్లతో బిగ్‌ బాస్‌ హౌజ్‌ హీటెక్కిపోతుంది. ముఖ్యంగా నామినేషన్లలో ఒకరిపై ఒకరు రెచ్చిపోతున్న తీరు నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అయితే పెద్దగా నోటెడ్‌ సెలబ్రిటీలు లేకపోవడంతో ఆడియెన్స్ నుంచి ఆ స్థాయిలో ఆసక్తి షోపై కనిపించడం లేదు. కానీ గత సీజన్(బిగ్‌ బాస్‌ తెలుగు 7) మాత్రం మంచి రేటింగ్‌ని సాధించింది. అన్ని సీజన్లలో కెళ్ల గత సీజన్‌ ఎక్కువ టీఆర్‌పీ సాధించడం విశేషం.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో సరికొత్త ప్రేమ కథలు, అసలైన కంటెంట్‌ ఇదే

అందులో హీరో శివాజీ, సీరియల్స్ ఫేమ్‌ శోభా శెట్టి, ప్రియాంక, అమర్‌ దీప్‌, అర్జున్‌ వంటి నోటెడ్ ఆర్టిస్టులున్నారు. అలాగే పల్లవి ప్రశాంత్‌ రెండు మూడు వారాల్లోనే పాపులర్‌ అయిపోయాడు చివరికి టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. అయితే చాలా వరకు ఏడో సీజన్‌లో హీరో, పాపులర్‌ సెలబ్రిటీ అయిన శివాజీ విన్నర్‌ అవుతాడని అంతా అనుకున్నారు.

ఆయన్ని విన్నర్‌ చేస్తామనే హామీతోనే బిగ్‌ బాస్‌లోకి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. చేయికి గాయమైనా, పెయిన్‌తో ఉన్నా ఆయన హౌజ్‌లో ఉండటం, ఆయనకు నాగ్‌ సైతం సపోర్ట్ గా నిలవడంతో విన్నర్‌ శివాజీనే అనుకున్నారు. కానీ ఫైనల్‌ లో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. 


ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై శివన్న స్పందించారు. `మీది విన్నింగ్‌ పొజీషియన్‌ అని, కానీ మీకు అన్యాయం జరిగిందని, అది మీ అభిప్రాయం అని విన్నాం. అది ఎంత వరకు నిజం` అనే ప్రశ్న ఎదురైన నేపథ్యంలో ఆయన అసలు విషయాన్ని బయటపెట్టారు. `నా వరకు అన్యాయం జరిగినా, కామన్‌ మ్యాన్‌ గెలిచాడు కాబట్టి సంతోషపడ్డాను` అని తెలిపారు శివాజీ.

ఇదే ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తుంది. మల్లెమాల నిర్వహించిన స్మాల్‌ చిట్‌ చాట్‌లో శివాజీ ఈ విషయాలను తెలిపారు. బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌గా నిలవాల్సిన శివాజీకి అన్యాయం జరిగిందనేది తేలిపోయింది. 

Pallavi Prashanth - Sivaji

పల్లవి ప్రశాంత్‌ విషయంలో మీరు చూపించిన ప్రేమ నిజం కాదని, జనాల్లో మెప్పు పొందేందుకు నటించారనే విమర్శలకు స్పందించారు శివాజీ. మన దేశానికి గాంధీజీ స్వాతంత్ర్యం తీసుకొచ్చాడంటే సమర్థించే వాళ్లూ ఉంటారు, అలాగే కొందరు వ్యతిరేకించే వాళ్లు కూడా ఉంటారు. ఆ మహాత్ముడిని చంపేసిన వాళ్లు కూడా ఉన్నారు.

ఏ పని చేసినా విమర్శించడానికి ఎవరో ఒకళ్లు ఉంటారు కాబట్టి, వాడు నా హార్ట్ కి క్లోజ్‌గా ఉన్నాడు, అందుకే దగ్గరయ్యాడు. ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తెలిపారు శివాజీ. వాడేంటో నాకు తెలుసు, నేనేంటో వాడికి తెలుసు` అని తెలిపారు శివాజీ. 
 

శివాజీ ఇటీవల `90 ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటించాడు. ఇది పెద్దహిట్‌ అయ్యింది. ఇప్పుడు ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో తన హిట్‌ పెయిర్‌గా నిలిచిన లయ తనకు జోడీగా చేస్తుండటం విశేషం. ఇటీవలే ఈ మూవీ ప్రారంభమైంది. దీనికి శివాజీనే నిర్మాత కావడం విశేషం.

అలాగే వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `కూర్మ నాయకి` చిత్రంలో శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ఆయన ఇప్పుడు మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారు. బిగ్‌ బాస్‌ షో ద్వారా ఆయన క్రేజ్‌ పెరిగి మళ్లీ నటుడిగా కమ్‌ బ్యాక్‌ అయ్యాడని చెప్పొచ్చు. 
 

Latest Videos

click me!