బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్.. యంగ్ డైరెక్టర్ తో..? ఆ సినిమా సీక్వెల్ చేస్తున్నారా..?

First Published | Sep 18, 2024, 4:55 PM IST

వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు నటసింహం బాలయ్య బాబు. ఇక చాలా కాలంగా ఎదరు చూస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను త్వరలో పట్టాలెక్కించబోతున్నాడట బాలకృష్ణ. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..? 

టాలీవుడ్ లో నటసింహం బాలకృష్ణ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుసినిమా పరిశ్రమకు నాలుగు స్థంబాల్లాంటి నలుగు హీరోలలో బాలయ్య ఒకరు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ దాదాపు 20 ఏళ్లు టైర్ 1 హీరోలుగా టాలీవుడ్ ను ఏలారు. 

ఇప్పటికీ బాలయ్యబాబు హీరోగా వరుస సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ కోడుతూనే ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ ను క్రాస్ చేసి.. మరో హ్యాట్రిక్ కు స్టార్ట్ చేస్తున్నాదు బాలకృష్ణ. ఈక్రమంలో బాలయ్య మెగా డైరెక్టర్ బాబీతో సినిమా చేస్తున్నాడు. ఈక్రమంలో బాలయ్యకు సబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
 

Balakrishna

బాలయ్య బాబు వరుస విజయాలతో అటు రాజకీయంగా.. ఇటు సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. హ్యాట్రిక్ విన్నింగ్ తో ఫుల్ జోష్ మీద  ఉన్న బాలకృష్ణ.. త్వరలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కు కొబ్బరికాయ కొట్టాలని చూస్తున్నారట. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ సినిమాను త్వరగా కంప్లీట్ చేయబోతున్నాడట. 

అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఓ యంగ్ డైరెక్టర్ ను ఎంచుకున్నాడట నట సింహం. ఆ దర్శకుడు అయితే తన సినిమా బాగా వస్తుంది అని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఆ దర్శకుడికి ముందుగా ఓ అగ్ని పరీక్ష కూడా పెట్టాడని సమాచారం ఇంతకీ ఆ పరిక్షఏంటో తెలుసా..? 

రామ్ చరణ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
 


Mokshagna

 ఇంతకీ బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలా కాలంగా వనిపిస్తుంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్  ఏంటి..? ఆ యంగ్ డైరెక్ట్ ఎవరు అని  బాలయ్య ఫ్యాన్స్ లో చాలా కాలంగా డౌట్ ఉంది. అయితే ఆ దర్శకుడు ఎవరో కాదు ప్రశాంత్ వర్మ. అవును హనుమాన్ లాంటి హిట్ సినిమాను అందించని ప్రశాంత్ వర్మకు  ఈ ప్రాజెక్ట్ అప్పగించాడట. 

అయితే ఈ ప్రాజెక్ట్ చేయడానికంటే ముందు తన తనయుడు మోక్షజ్ఞ ను లాంచ్ చేసే అవకాశం ఇచ్చాడు బాలకృష్ణ.  ఈ సినిమాను బాగా చేసి.. తన కొడుకును హీరోగా  మెటీరియల్ గా చూపించగలిగితే.. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ప్రశాంత్ వర్మకే వచ్చే అవకాశం ఉంది. 

ఆదిత్యా 369 (1991)- 3.5కోట్లు

ఇతకీ బాలయ్య ట్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా.. ఆదిత్య 369  సీక్వెల్. ఈమూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈమూవీ బాలయ్య ఫ్యాన్స్ తో పాటు.. టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంతో అలరించింది. ఈసినిమాలో బాలయ్య ను చూసి లేడీస్ ప్రేమలో పడిపోయారు. 

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 ను గతంలో ప్లాన్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. అంతే కాదు కథ కూడా రెడీ చేశారట. కాని సింగీతం వయోభారంతో ఈప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం సింగీతం శ్రీనివాసరావు కు 92 ఏళ్ళు కావడంతో.. ఈ ప్రాజెక్ట్ ను కరెక్ట్ గా డీల్ చేయగలిగే దర్శకుడు కోసం చూస్తున్నారు. 

అసలు ఈకథతో తన తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ ప్లాన్ చేశారట బాలయ్య. కాని ఎందుకు ఈ  ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఇక  మోక్షజ్ఞ కోసం మరో సోసియో ఫాంటసీ మూవీ సెట్ చేసిన బాలయ్య.. ఈ సినిమా తరువాత ఆదిత్య 999 ను పట్టాలెక్కించబోతున్నట్టు సమాచారం. 

ఈ సినిమాతో పాటు సింగీతం డైరెక్ట్ చేసిన భైరవ ధ్వీపం సినిమా కూడా సూపర్ హిట్అయ్యింది. ఈ సినిమా కూడా సీక్వెల్ చేసే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్టు సమాచారం. చూడాలి మరి బాలయ్య ఈమూవీని పట్టాలెక్కిస్తారా.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను హిట్ చేసుకుంటారా లేదా అని. 

Latest Videos

click me!