Divya Bharti: ఆమె స్టార్ కావాల్సింది, మరణానికి కారణం ఇదే... కీలక విషయాలు వెల్లడించిన బాలీవుడ్ హీరో!

First Published Apr 13, 2024, 2:21 PM IST

నటి దివ్య భారతి మరణం అప్పట్లో పెద్ద మిస్టరీ. ఆమె ప్రమాదవశాత్తు మరణించారు అనేది నిజం కాదని కొందరి వాదన. దివ్య భారతి మరణానికి కారణం ఇదే అంటూ ఆమెతో పని చేసిన ఓ నటుడు తాజాగా వెల్లడించారు. 
 

Divya Bharati


16 ఏళ్ల ప్రాయంలో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది దివ్య భారతి. ఆమె పట్టిందల్లా బంగారం అయ్యింది. 19 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయ్యింది. 1990లో విడుదలైన ఓ తమిళ చిత్రంతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. బొబ్బిలి రాజా రెండో చిత్రం. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బొబ్బిలి రాజా బ్లాక్ బస్టర్. వరుసగా మోహన్ బాబుకు జంటగా అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు చిత్రాలు చేసింది. ఇవి కూడా భారీ విజయాలు సాధించాయి. 

విశ్వాత్మ మూవీతో బాలీవుడ్ లో అక్కడ కూడా ఆమె తిరుగులేని  చేసుకుంది. కేవలం మూడేళ్ళ దివ్య భారతి పాతిక చిత్రాల వరకు చేసింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని దివ్య భారతి ఏలడం ఖాయం అనుకుంటుండగా ఆమెను మృత్యువు కాటేసింది. 1993 ఏప్రిల్ 5న దివ్య భారతి ప్రమాదవశాత్తు మరణించింది. అయితే ఆమె మరణం వెనుక ఎవరో ఉన్నారు. అది ప్రమాదం కాదనే వాదన ఉంది. 

దివ్య భారతితో కలిసి పని చేసిన నటుడు, ప్రొడ్యూసర్ కమల్ సదానా తాజాగా ఈ ఘటనపై స్పందించారు. దివ్య భారతి మరణ వార్త నన్ను కలచి వేసింది. నేను జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే ఆమె గొప్ప నటి. ఆమెతో పని చేయడం చాలా సరదాగా ఉండేది. దివ్య భారతి మరణవార్త విని షాక్ అయ్యాను. అంతకు మూడు రోజుల ముందే నేను ఆమెతో పని చేశాను. 

దివ్య భారతి చనిపోయేనాటికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ చేసి ఉంటే పెద్ద స్టార్ అయ్యేది. దివ్య భారతి ప్రమాదవశాత్తు మరణించిందని నేను నమ్ముతున్నాను. ఆమెకు ఎలాంటి సమస్యలు లేవు. ఆరోగ్యంగానే ఉంది. కాస్త డ్రింక్ చేసి ఉండొచ్చు.. అని అన్నారు. దివ్య భారతి-కమల్ సదానా రంగ్ అనే చిత్రంలో కలిసి నటించారు. 

ముంబై అంధేరిలోని వెర్సోవా దగ్గర గల తులసి బిల్డింగ్స్ లో దివ్య భారతి నివసించేవారు. ఆమె ఐదవ ఫ్లోర్ నుండి సాయంత్రం వేళ క్రిందకు పడిపోయారు. వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. తలకు బలైన గాయం కావడంతో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి మరణించినట్లు వైద్యులు తెలిపారు...

click me!