నాన్నకు నాలుగు పెళ్లిళ్లు నాకు ఒక్కటి కూడా కాలేదు... కంట్రోల్ చేయలేం,నవీన్ విజయ్ కృష్ణ షాకింగ్ రియాక్షన్!

Published : Jul 11, 2024, 02:16 PM IST

నటుడు నరేష్ ఏకంగా నాలుగు వివాహాలు చేసుకున్నారు. కానీ ఆయన పెద్ద కొడుకు నవీన్ విజయ్ కృష్ణకు అసలు పెళ్లే కాలేదు. ఇదే విషయం నవీన్ విజయ్ కృష్ణను అడిగితే అనూహ్య స్పందన వచ్చింది..   

PREV
18
నాన్నకు నాలుగు పెళ్లిళ్లు నాకు ఒక్కటి కూడా కాలేదు... కంట్రోల్ చేయలేం,నవీన్ విజయ్ కృష్ణ షాకింగ్ రియాక్షన్!
Naresh

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో నరేష్ ఒకడు. నటి విజయనిర్మల కుమారుడైన నరేష్ బాలనటుడిగా కెరీర్ ఆరంభించాడు. పెద్దయ్యాక హీరోగా మారి పలు హిట్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. నరేష్ అత్యంత డిమాండ్ ఉన్న నటుడు. పాత్ర ఏదైనా సహజ నటనతో కట్టిపడేస్తాడు. 

 

28
Actor Naresh

నటుడిగా సక్సెస్ అయిన నరేష్ వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వైవాహిక జీవితంలో విఫలం చెందాడు. అధికారికంగా నరేష్ మూడు వివాహాలు చేసుకున్నారు. ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ తో కలిసి జీవిస్తున్నారు. వీరికి వివాహం జరిగిందో లేదో క్లారిటీ లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నరేష్-పవిత్ర పెళ్లి చేసుకున్నారని అంటారు. 

38
Naveen Vijay Krishna


అయితే నరేష్ పెద్ద కుమారుడు నవీన్ విజయ్ కృష్ణకు వివాహం కాలేదు. నవీన్ వయసు దాదాపు నలబై ఏళ్ళు ఉంటుంది. ఆయన ఏజ్ బార్ బ్యాచ్ లర్ అనడంలో సందేహం లేదు. కన్న కొడుక్కి పెళ్లి చేయకుండా నరేష్ నాలుగులో వివాహం చేసుకోవడం ఏమిటీ? అనే విమర్శలు ఉన్నాయి. పిల్లలను నరేష్ పెద్దగా పట్టించుకోరనే పుకార్లు కూడా ఉన్నాయి. 

48
Naveen Vijay Krishna

తండ్రికి నాలుగు పెళ్లిళ్లు జరిగితే కొడుకు పెళ్లి చేసుకోకుండా బ్యాచ్ లర్ గా మిగిలిపోయాడనే విమర్శల మీద నవీన్ స్వయంగా స్పందించాడు. ఈ విమర్శలను ఎలా చూస్తారని అడగ్గా... అసలు ఆ విషయాలకు నేను కనెక్ట్ అవ్వను. ఆలోచించను. అనవసరమైన చోట నేను ఎనర్జీ పెట్టి వేస్ట్ చేసుకోను. ఇక జనాల కామెంట్స్ అంటారా... అది హ్యూమన్ నేచర్. ఇతరుల గురించి చెప్పుకొని సంతోషపడతారు.. 
 

58
Naveen Vijay Krishna

  మనం ఎవరినీ ఆపలేం. నేను కూడా ట్రోల్స్ చేస్తాను. నేను పెద్ద ట్రోలర్ ని.  కాకపోతే సెన్సిటివ్ మేటర్స్ మీద జోక్స్ వేయకూడదు. అది నా పాలసీ. మాట్లాడుకునే వారిని మాత్రం మనం కంట్రోల్ చేయలేము. విమర్శలు చేసే వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. 
 

68

ఈ మాట్లాడేవారంతా ఆయన ఆర్థికంగా, వ్యక్తిగతంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేదు కదా. ఆయన పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాడు. పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు అనుకుంటారు. ఆయన పడిన కష్టాలు ఎవరికీ తెలియదు. పక్కనోడి జీవితాన్ని జోక్ చేయడం చాలా ఈజీ. నరేష్ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఆయన వ్యక్తిగత జీవితం ఆయనది. మాట్లాడుకునే వాళ్ళు ... వాళ్ళ జీవితాలు సరిద్దిదుకుంటే బెటర్ అని మాత్రం నేను చెప్పగలను... అన్నారు. 

78


మరి మీరు ఇప్పటి వరకు వివాహం చేసుకోకపోవడానికి కారణం? అని అడగ్గా...  నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియదు. ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. చేసుకోవాలి అనిపిస్తే చేసుకోవాలి. చేసుకోవాలి కాబట్టి పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే రైట్ టైం లో చేసుకోవడం బెటర్. పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను సింగిల్. అమ్మాయి లవ్ లైఫ్ నేను గెలవలేకపోయాను. నేను ఏ పనైనా చేస్తాను. కానీ మానసికంగా ప్లాన్స్ చేయలేను. ఎవరైనా ఒకరు జీవితంలోకి వస్తే వస్తారు. లేదంటే ఎప్పటికీ ఇంతే.. అన్నారు. 

 

pic credit: Suman tv 

 

88

నవీన్ కృష్ణ హీరోగా కొన్ని చిత్రాలు చేశాడు. ఐనా ఇష్టం నువ్వు, నందిని నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు చిత్రాల్లో నటించాడు. అవేమీ పెద్దగా ఆడలేదు. నవీన్ ఎప్పుడూ కుటుంబ సభ్యుల మీద ఆధారపడేలేదట. ఎడిటర్ గా పని చేస్తూ తన అవసరాలకు తానే డబ్బులు సమకూర్చుకునేవాడట. ఈ విషయం గతంలో ఓ ఇంటర్వ్యూలో నవీన్ చెప్పాడు.. 

 

pic credit: Suman tv 

click me!

Recommended Stories