Highest Multistarrer Hero: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు

Published : Oct 06, 2026, 05:44 PM IST

Highest Multistarrer: మల్టీస్టారర్‌ సినిమాలు ఇప్పుడు తక్కువగా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం చాలా వచ్చేవి. తొలితరం హీరోలు వరుసగా ఈ సినిమాలు చేసేవారు. మరి తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరంటే?

PREV
16
అత్యధిక మల్టీస్టారర్‌ చిత్రాలు చేసిన హీరో

తెలుగు సినిమా చరిత్రలో మల్టీస్టారర్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడం అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. అయితే తరతరాల హీరోలతో కలిసి నటిస్తూ మల్టీస్టారర్ సినిమాల విషయంలో తనకంటూ ప్రత్యేక రికార్డు సృష్టించిన నటుడు మాత్రం సూపర్‌స్టార్ కృష్ణ. ఏకంగా దాదాపు 80 మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన ఘనత ఆయన సొంతమని సినీ వర్గాల్లో పేర్కొంటారు.

కృష్ణ తన కెరీర్‌లో సుమారు 350 సినిమాల్లో నటించారు. ఇందులో సోలో హీరోగా చేసిన చిత్రాలతో పాటు ఇతర హీరోలతో కలిసి చేసిన సినిమాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆయన మల్టీస్టారర్ ప్రయాణం కాంతారావుతో కలిసి నటించిన ‘ఇద్దరు మొనగాళ్లు’ సినిమాతో ప్రారంభమైంది. ఈ కాంబినేషన్‌లో ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా వచ్చాయి.

26
ఎన్టీఆర్‌తో ఐదు మల్టీస్టారర్స్

అగ్ర హీరో ఎన్టీఆర్‌తో కృష్ణ కలిసి నటించిన తొలి చిత్రం ‘స్త్రీ జన్మ’. ఆ తర్వాత ‘నిలువు దోపిడి’, ‘విచిత్ర కుటుంబం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ వంటి సినిమాల్లోనూ ఇద్దరూ కలిసి కనిపించారు. విశేషమేమిటంటే ఈ ఐదు సినిమాల్లోనూ కృష్ణ, ఎన్టీఆర్‌లు అన్నదమ్ముల పాత్రల్లో కనిపించడం.

36
ఏఎన్నార్‌తో అదిరిపోయే సినిమాలు

అలాగే కృష్ణకు స్ఫూర్తినిచ్చిన నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కూడా ఆయన పలు చిత్రాల్లో నటించారు. ‘మంచి కుటుంబం’, ‘అక్కా చెల్లెళ్లు’, ‘హేమా హేమీలు’, ‘గురు శిష్యులు’, ‘ఊరంతా సంక్రాంతి’, ‘రాజకీయ చదరంగం’ వంటి సినిమాల్లో ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది.

46
అత్యధికంగా కృష్ణంరాజుతో, శోభన్‌బాబుతో ఎన్నంటే?

కృష్ణతో అత్యధిక సినిమాల్లో కలిసి నటించిన హీరోగా కృష్ణంరాజు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరిద్దరి కలయికలో ఏకంగా 19 సినిమాలు వచ్చాయి. మరో సమకాలీన హీరో శోభన్ బాబుతో 13 సినిమాల్లో కృష్ణ కలిసి నటించారు. మోహన్ బాబుతో నాలుగు సినిమాలు చేశారు. కాంతారావు, శివాజీ గణేశన్, రజినీకాంత్, సుమన్‌లతో మూడేసి సినిమాల్లో కనిపించారు.

56
ఆ తర్వాత తరంతోనూ మల్టీస్టారర్స్

తరువాతి తరానికి చెందిన హీరోలతోనూ కృష్ణ మల్టీస్టారర్స్ చేశారు. నాగార్జునతో రెండు సినిమాల్లో నటించగా, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమాలో కలిసి కనిపించారు. ఇలా తన సమకాలీన హీరోలతోనే కాకుండా తనకంటే ముందు తరం, తన తరం, తన తర్వాతి తరం హీరోలతోనూ కృష్ణ తెరను పంచుకున్నారు.

66
సొంత కొడుకులతో కృష్ణ మల్టీస్టారర్స్

ఇక తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతోనూ కృష్ణ నటించారు. రమేష్ బాబుతో ఐదు సినిమాల్లో, మహేష్ బాబుతో ఏకంగా ఏడు సినిమాల్లో కలిసి కనిపించారు. ముఖ్యంగా తండ్రి, కొడుకుల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి.

ఒక నటుడు ఇన్ని తరాల హీరోలతో కలిసి ఇంత పెద్ద సంఖ్యలో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడం అరుదైన విషయం. అందుకే తెలుగు సినిమా మల్టీస్టారర్ చరిత్రను ప్రస్తావించినప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. దాదాపు 80 మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన కృష్ణ.. ఈ విషయంలో తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోయే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories