భార్యగా నటిస్తూ బాలయ్యకి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్..17 సినిమాల్లో రొమాన్స్ చేసి చివరికి అన్నా అనేసింది

First Published Oct 30, 2024, 10:27 AM IST

సిల్వర్ స్క్రీన్ పై కొందరు హీరో హీరోయిన్లు రొమాన్స్ చేస్తే ఫ్యాన్స్ కి కనుల పండుగలా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించారు.

సిల్వర్ స్క్రీన్ పై కొందరు హీరో హీరోయిన్లు రొమాన్స్ చేస్తే ఫ్యాన్స్ కి కనుల పండుగలా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. బాలయ్యతో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లలో విజయశాంతి కూడా ఒకరు. విజయశాంతి.. చిరంజీవితో పాటు బాలయ్యతో కూడా అత్యధిక చిత్రాల్లో నటించింది. 

బాలకృష్ణ, విజయశాంతి దాదాపు 17 చిత్రాల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ పై వెళ్ళిద్దరిదీ సూపర్ హిట్ పెయిర్. రౌడీ ఇన్స్పెక్టర్, ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. విజయశాంతి, బాలకృష్ణ తొలిసారి 1984 లో కథానాయకుడు చిత్రంలో నటించారు. ఆ తర్వాత 17 చిత్రాల పాటు వీరిద్దరి కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా సాగింది. 

Latest Videos


1987లో బాలయ్య, విజయశాంతి భానుమతి గారి మొగుడు చిత్రంలో జంటగా నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బాలయ్య, విజయశాంతి నటించిన 9 వ చిత్రం ఇది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పటికే బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అనే ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంది. వీళ్లిద్దరి కెమిస్ట్రీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవారు. 

భానుమతి గారి మొగుడు చిత్ర షూటింగ్ జరుగుతుండగా.. రాఖీ పండగ వచ్చిందట. విజయశాంతి రాఖీలు తెప్పించి బాలయ్యకి కట్టి సర్ప్రైజ్ చేసిందట. ఈ విషయాన్ని విజయశాంతి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ చిత్రంలో విజయశాంతి బాలయ్యకి భార్యగా నటిస్తోంది. ఒక వైపు భార్యగా నటిస్తూ ఆఫ్ స్క్రీన్ లో చెల్లెలు లాగా రాఖీ కట్టడంతో అందరికీ షాక్ తప్పలేదు. 

బాలయ్య నేను ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆయన నాకు ఒక బ్రదర్ లాంటివారు. రియల్ లైఫ్ లో పర్సనల్ విషయాలని కూడా మేమిద్దరం అన్నా చెల్లెళ్ళ లాగా షేర్ చేసుకుంటాం. రియల్ లైఫ్ లో బాలయ్య నాకు అన్నయ్య లాంటి వారు అని విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి.. బాలయ్యని సోదర భావంతో చూడడంలో తప్పులేదు. కానీ 17 చిత్రాల్లో వీరిద్దరి రొమాన్స్ చూసిన ఆడియన్స్ మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మూవీలో పవర్ ఫుల్ రోల్ చేస్తోంది. 

click me!