చంద్రశేఖర్ దర్శకుడు, నిర్మాత, రచయిత కూడాను. ఆయన భార్య శోభ సైతం సినీ రచయిత కావడం మరొక విశేషం. చంద్రశేఖర్ చట్టానికి కళ్ళు లేవు చిత్రంతో చిరంజీవికి మంచి హిట్ ఇచ్చాడు. ఇది తమిళ చిత్రం రీమేక్. ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ కాంత్ హీరోగా నటించాడు. తమిళంలో విజయం సాధించిన ఆ కథ... తెలుగులో సైతం ఆదరణ దక్కించుకుంది.
చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రాల్లో చట్టానికి కళ్ళు లేవు ఒకటి. చట్టంలోని లొసుగులను ఎత్తి చూపుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనంతరం చంద్రశేఖర్-చిరంజీవి కాంబోలో పల్లెటూరి మొనగాడు మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం సైతం చెప్పుకోదగ్గ విజయం అందుకుంది. చిరంజీవికి జంటగా రాధిక నటించింది. ఇది కూడా రీమేక్ కావడం విశేషం. ఒరిజినల్ లో విజయ్ కాంత్ నటించారు. రెండు వెర్షన్స్ కి చంద్రశేఖర్ దర్శకుడిగా వ్యవహరించారు.