Ram Charan and Shankar Game Changer Movie: రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి విడుదలై ఎంతలా నిరాశ పరిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిరాశ పక్కన పెడితే నిర్మాతకి భారీ నష్టాలు మిగిల్చింది. డైరెక్టర్ శంకర్ ఈ మధ్యన ఏమాత్రం కలసి రావడం లేదు.
Ram Charan and Shankar Game Changer Movie:రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి విడుదలై ఎంతలా నిరాశ పరిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిరాశ పక్కన పెడితే నిర్మాతకి భారీ నష్టాలు మిగిల్చింది. డైరెక్టర్ శంకర్ ఈ మధ్యన ఏమాత్రం కలసి రావడం లేదు. రోబో నుంచి శంకర్ తన స్టైల్ మార్చి విజువల్ భారీగా ఉండే చిత్రాలు మొదలు పెట్టారు. రోబో ఒక్కటి వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఐ డిజాస్టర్, 2.0 కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
24
Game Changer Movie
ఇక మళ్ళీ శంకర్ తన పాత పద్దతికి వచ్చారు. అవినీతి నిర్మూలన అంశాలు ఉన్న భారతీయుడు 2 చిత్రాన్ని గత ఏడాది తెరకెక్కించారు. భారతీయుడు 2 ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. కమల్ హాసన్ హీరోగా 250 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఆ డబ్బంతా వృధా అయినట్లే. ఆరు నెలల వ్యవధిలో శంకర్ నుంచి విడుదలైన మరో చిత్రం గేమ్ ఛేంజర్.
34
shankar
ఈ చిత్రాన్ని దిల్ రాజు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ఆ డబ్బు కూడా వృధా అయింది. అయితే ఒక క్రేజీ హీరో మాత్రం శంకర్ నుంచి తప్పించుకున్నారు. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. రణ్వీర్ సింగ్ తో శంకర్ అపరిచితుడు హిందీ రీమేక్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అనౌన్స్ చేశారు కూడా.
44
Ranveer Singh and Shankar
అపరిచితుడు రీమేక్ కనుక తెరకెక్కి ఉంటే మరో 300 కోట్ల బడ్జెట్ ఖర్చయ్యేది. ఎందుకంటే శంకర్ తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేయరు. అదే జరిగి ఉంటే ఆ చిత్ర రిజల్ట్ ఎలా ఉండేదో చెప్పనవసరం లేదు. ఎందుకంటే రీమేక్ చిత్రాలకు కాలం చెల్లింది. పైగా అపరిచితుడు 20 ఏళ్ళ క్రితం చిత్రం. దేశం మొత్తం ఆడియన్స్ ఆ చిత్రాన్ని ఏదో ఒక రూపంలో చూసేసి ఉంటారు. నిమిషంలో రీమేక్ చిత్రం వద్దని రణ్వీర్ సింగ్ తప్పుకున్నారు. లేకుంటే మరో 300 కోట్లు వృధా అయ్యేది.