ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అది మాత్రం చెడగొట్టారు, చెత్త సినిమా అని తేల్చేసిన మహేష్ బాబు వైఫ్

Published : Mar 07, 2025, 07:05 AM IST

Mahesh Babu : మహేష్ బాబు డెబ్యూ మూవీ రాజకుమారుడు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబు కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టే చిత్రాలు ఎదురయ్యాయి. యువరాజు మూవీ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత మహేష్ నటించిన వంశీ దారుణమైన డిజాస్టర్. 

PREV
15
ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అది మాత్రం చెడగొట్టారు, చెత్త సినిమా అని తేల్చేసిన మహేష్ బాబు వైఫ్
Mahesh Babu

Mahesh Babu :సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు చిత్రంతో మాస్ హీరోగా మారారు. అప్పటి వరకు మహేష్ ని ఆడియన్స్ లవర్ బాయ్ గానే పరిగణిస్తూ వచ్చారు. మహేష్ బాబు డెబ్యూ మూవీ రాజకుమారుడు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబు కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టే చిత్రాలు ఎదురయ్యాయి. 

 

25

యువరాజు మూవీ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత మహేష్ నటించిన వంశీ దారుణమైన డిజాస్టర్. ఈ చిత్రానికి దర్శకుడు బి గోపాల్. ఆయన గురించి చెప్పనవసరం లేదు. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ఆయన. మహేష్ ని కూడా స్టార్ గా నిలబెడతాడు అని ఆ టైంలో అంతా భావించారు. 

 

35

అత్యంత భారీ ఖర్చుతో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలని న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు చిత్రీకరించారు. నమ్రత టాలీవుడ్ కి లాంచ్ అయింది ఈ చిత్రంతోనే. మహేష్, నమ్రత మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకి దారితీసిన చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి సంబంధించి ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి. కానీ రిజల్ట్ మాత్రం డిజాస్టర్. 

 

45

మహేష్ బాబుకి హెవీ మాస్ ఎలిమెంట్స్ పెట్టడం, చివర్లో కృష్ణ ఎంట్రీ లాంటి అంశాలు ఈ కథని చెడగొట్టాయి అని కామెంట్స్ వినిపించాయి. మణిశర్మ మంచి సంగీతం అందించారు. కథలోనే తప్పు జరిగింది అని ఆ తర్వాత బి గోపాల్ అంగీకరించారు. 

 

55

మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా ఓ ఇంటర్వ్యూలో వంశీ చెత్త సినిమా అని తేల్చేశారు. మహేష్ చిత్రాల్లో నచ్చని మూవీ అదే అని.. మురారి, అతడు, పోకిరి అంటే చాలా ఇష్టం అని నమ్రత పేర్కొన్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories