ధనుష్ ‘జాబిలమ్మ..’: OTT రిలీజ్ డేట్, ప్లాట్‌ఫామ్

Published : Mar 07, 2025, 06:05 AM IST

Dhanush: ధనుష్ దర్శకత్వంలో వచ్చిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా యొక్క OTT స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది.

PREV
13
ధనుష్  ‘జాబిలమ్మ..’:  OTT రిలీజ్ డేట్,  ప్లాట్‌ఫామ్
Dhanush Jaabilamma Neeku Antha Kopama Movie OTT Stremaing Details in telugu

Dhanush:  తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)  దర్శకత్వంలో రూపొందిన రూపొందిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (Jaabilamma Neeku Antha Kopama).  ఫిబ్రవరి 21న తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.

ధనుష్ మేనల్లుడు పవిష్ ఈ సినిమాలో హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan)  చేసిన స్పెషల్ సాంగ్ ‘గోల్డెన్ స్పారో’ మంచి హిట్టైంది. జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతంలో రూపొందిన పాటలు బాగున్నాయి. ఇక ఈ చిత్రం భాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్దాయలో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఓటీటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
 

23
Dhanush Jaabilamma Neeku Antha Kopama Movie OTT Stremaing Details in telugu


ట్రేడ్  వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో మార్చి  21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటిటిలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

 ‘గోల్డెన్ స్పారో’ అనే పాట రిలీజ్ కి ముందు బాగా వైరల్ అయ్యింది. అది సినిమా పబ్లిసిటీకి పనికొచ్చింది అని చెప్పాలి. 
 

33
Dhanush Jaabilamma Neeku Antha Kopama Movie OTT Stremaing Details in telugu


తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి’ సంస్థ రిలీజ్ చేసింది. రిలీజ్ అయ్యి మంచి టాక్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయింది.

మొదటి రోజున వరల్డ్ వైడ్ గా 3.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా రెండో రోజునుంచే  గ్రోత్ ని చూపించ లేక డ్రాప్ అయ్యింది. పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. చిత్ర టీమ్ కొంచెం బెటర్ గా ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా కొంచెం ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవేమో.

Read more Photos on
click me!

Recommended Stories