స్వర్గీయ నందమూరి తారక రామారావు వందల చిత్రాల్లో నటించారు. పౌరాణిక చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. భక్తిరసా చిత్రాలు, జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. కృష్ణుడిగా, రాముడిగా, పరమశివుడుగా, రావణుడిగా కనిపించిన ఎన్టీఆర్ విశ్వామిత్ర లాంటి పాత్రలని కూడా పోషించారు.