టాలీవుడ్ స్టార్స్ అందరూ సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటారు. మహేష్ బాబు కూడా తన సినిమాలకు స్వయంగా డబ్బింగ్ చెబుతారు. అయితే కొన్ని సినిమాల్లో మీరు విన్న వాయిస్ మహేష్ బాబుది కాదట. ఆయనకు ఓ కమెడియన్ డబ్బింగ్ చెప్పాడట. ఆ కమెడియన్ ఎవరో చూద్దాం...
సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత భారీ ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. నెగిటివ్ టాక్ తో కూడా మహేష్ సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తాయి. ఆయన రేంజ్ అది. మహేష్ కు ఉన్న హ్యాండ్సమ్నెస్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్టైల్... విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి.
26
మహేష్ బాబు డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంటెన్స్ తో కూడిన డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆడియన్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ కూడా అదుర్స్. చాలా సహజంగా మహేష్ బాబు డైలాగ్స్ ఉంటాయి. చెప్పాలంటే తండ్రి కృష్ణ వాయిస్ కి మహేష్ వాయిస్ చాలా దగ్గరగా ఉంటుంది.
36
మీరు చూసిన కొన్ని మహేష్ సినిమాల్లో వాయిస్ ఆయనది కాదంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. మహేష్ బాబు డబ్బింగ్ ఆర్టిస్ట్ సహాయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. షాకింగ్ మేటర్ ఏంటంటే... ఒక సినిమా మొత్తానికి ఆయన డబ్బింగ్ చెప్పలేదు. ఓ కామెడీ మహేష్ బాబుకు వాయిస్ అరువిచ్చాడు. అది ఏ సినిమా? ఆ ఆర్టిస్ట్ ఎవరు? అంటే..
46
Bullet Bhaskar
మహేష్ బాబుకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ ఒక జబర్దస్త్ కమెడియన్. అతడే బుల్లెట్ భాస్కర్. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకరైన బుల్లెట్ భాస్కర్ మిమిక్రీ కూడా చేస్తారు. ముఖ్యంగా ఆయన మహేష్ బాబు వాయిస్ మక్కీకి మక్కీ దించుతారు. ఆయన మాట్లాడుతుంటే మహేష్ బాబు మాట్లాడుతున్నట్లే ఉంటుంది.
56
Bullet Bhaskar
2014లో విడుదలైన వన్ నేనొక్కడినే చిత్రం మొత్తానికి బుల్లెట్ భాస్కర్ మహేష్ బాబు పాత్రకు డబ్బింగ్ చెప్పారట. ఈ విషయాన్ని బుల్లెట్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే మహేష్ బాబు నటించిన కొన్ని యాడ్స్ కి కూడా బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్పారట. ఇది ఊహించని పరిణామం. కాబట్టి వన్ నేనొక్కడినే చిత్రంలో మీరు వినేది మహేష్ వాయిస్ కాదు.
66
Mahesh Babu
అదన్నమాట మేటర్. మహేష్ బాబుకు సమయం కుదరనప్పుడు డబ్బింగ్ సహాయం తీసుకుంటాడు. మహేష్ బాబుకి బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెబుతారు. కాగా మహేష్ బాబుని నేరుగా కలిసే అవకాశం ఇంత వరకు దక్కలేదని బుల్లెట్ భాస్కర్ ఆ ఇంటర్వ్యూలో అన్నారు.