జూన్ 2024: అశ్వనీదత్ కు రెండు రకాలుగా కలిసొచ్చిన గోల్డెన్ మంత్

Published : Jul 04, 2024, 06:22 AM IST

జూన్ 2024  అశ్వనీదత్ కు  బాగా కలిసొచ్చింది.  జీవితంలో గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చింది.  అందుకు రెండు కారణాలు ఉన్నాయి.

PREV
110
 జూన్ 2024:  అశ్వనీదత్ కు రెండు రకాలుగా కలిసొచ్చిన గోల్డెన్ మంత్


 

నిర్మాత అశ్వనీదత్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. తమ  వైజయంతీ సంస్థలో తీసిన బ్లాక్ బస్టర్ హిట్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అశ్వనీదత్ బ్యానర్ లో సినిమా అంటే ఇప్పటికి హీరోలు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూంటారు. అయితే ఆయన తన కూతుళ్లు చేతిలో సంస్దను పెట్టాక కొద్దిగా తగ్గారు. కానీ ఇప్పుడు కల్కితో మరోసారి తనేంటో ,తన బ్యానర్ సత్తా ఏమిటో చూపించారు. జూన్ 2024 ఆయనకు బాగా కలిసొచ్చింది. లైఫ్ లో గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చింది.  అందుకు రెండు కారణాలు ఉన్నాయి.
 

210
Nag Ashwin


జూన్  నెల ప్రారంభంలో తను మొదటి నుంచి బహిరంగంగానే సపోర్ట్ ఇస్తూ వస్తున్న తెలుగుదేశం కూటమి ఘనవిజయం నమోదు చేసింది. ఏపీలో జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌కు ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడ‌తార‌నే విష‌యాన్ని తాను ముందే ఊహించాన‌ని, ఎక్క‌డ‌కు వెళ్లినా, ఎవ‌రితో మాట్లాడినా జ‌గ‌న్ దిగిపోవాల‌న్న ఆకాంక్షే క‌నిపించిందని, ఇప్పుడు ఏపీలో అదే జ‌రిగింద‌న్నారు నిర్మాత సి.అశ్వ‌నీద‌త్‌. 
 

310


అశ్వనీదత్ టీడీపీకి బలమైన మద్దతుదారుడు.  అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతూ ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలో సినీ పరిశ్రమ మౌనంగా ఉంటే ఒక్క అశ్వనీదత్ మాత్రమే చంద్రబాబును కలిసి బహిరంగంగా సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో చాలా మంది  విఫలమయ్యారు. కానీ అశ్వనీదత్ మాత్రం ఈ విషయంలో విజయం సాధించారనే చెప్పాలి.

410
Aswani dutt


వైసీపీ గెలిచి ఉంటే జగన్ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’కి భారీ షాక్ తగిలేది. అందుకే ఆయన ఎన్నికల తర్వాత చావో రేవో తేల్చుకోవాలి అనుకున్నాడు. అందుకు జూన్ లో రిలీజ్ అనౌన్స్ చేశాడు. కల్కి భారీ బడ్జెట్ చిత్రం. సినిమా స్థాయి, విజువల్స్, పెద్ద తెరపై కాస్టింగ్ చూశాక ఆ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

510
Aswani dutt


ఇక జూన్ చివర్లో వచ్చిన కల్కి చిత్రం ఘన విజయం సాధించింది. అంతేకాదు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ స్థాపించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ స్దాయి బ్లాక్ బస్టర్  సినిమా చేయటం కూడా ఆనందానికి కారణమే.  పురాణ పాత్రలు, సైన్స్‌ ఫిక్షన్‌ను కలుపుతూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  పకడ్బందీగా కథను సిద్ధం చేశారని చెప్పిన అశ్వనీదత్‌ .. సినిమా అంత మొత్తంలో ఖర్చు పెట్టడానికి కారణం ప్రభాస్‌  , కమల్‌  , అమితాబ్‌ బచ్చన్‌ అని తేల్చేశారు. వాళ్లు ఉన్నారనే ధైర్యంతోనే సినిమాకు అంత మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టామని, ఇప్పుడు మా నమ్మకం నిజమై వందల కోట్ల రూపాయల వసూళ్లు వస్తున్నాయని అశ్వనీదత్‌ చెప్పుకొచ్చారు.

610


తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు ఇవ్వడం మంచి నిర్ణయమని చెప్పిన అశ్వనీదత్‌.. ఈ పెంపు వల్ల బ్లాక్‌ టికెటింగ్‌ తగ్గుతుందని తద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు మంచే జరుగుతుంది అని చెప్పారు. అయితే కొంతమంది మాత్రం ‘టికెట్‌ రేట్లు పెంచి నిర్మాతలు దండుకుంటున్నారు’ అని ఆరోపణలు చేస్తున్నారని అశ్వనీదత్‌ అన్నారు. అలాంటి ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. వారం తర్వాత టికెట్‌ ధరలు సాధారణమైపోతాయని కూడా అన్నారు.
 

710
Kalki 2898 AD


రికార్డుల్ని ల‌క్ష్యంగా చేసుకొని తామెప్పుడూ సినిమాలు చేయ‌లేద‌ని, అయితే క‌ల్కి మాత్రం క‌నీసం 1400 నుంచి 1500 కోట్లు సాధించే అవ‌కాశం ఉంద‌ని, తొలిరోజు వ‌చ్చిన వ‌సూళ్లు అంత‌టి న‌మ్మ‌కాన్ని క‌లిగించాయ‌ని చెప్పుకొచ్చారు. ”క‌ల్కి 2′ కి సంబంధించిన కొంత‌మే షూటింగ్ జ‌రిగింది. పార్ట్ 2 పూర్త‌వ్వ‌డానికి క‌నీసం యేడాదిన్న‌ర ప‌డుతుంది. నాగ అశ్విన్‌పై నాకు చాలా గ‌ట్టి న‌మ్మ‌కం. త‌ను ఏ క‌థ చెప్పినా, ఏమాత్రం ఆలోచించ‌కుండా సినిమాలు తీయ‌మ‌ని మా అమ్మాయిల‌కు చెప్పాను” అన్నారు.

810
Kalki 2898 AD


చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో అశ్వ‌నీద‌త్‌కు నామినేటెడ్ ప‌దవులు వ‌స్తాయ‌న్న ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రుగుతోంది. దీనిపై కూడా ఆయ‌న స్పందించారు. అవ‌న్నీ గాసిప్పులేన‌ని, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి కీల‌క‌మైన వ్య‌క్తుల‌కు చంద్ర‌బాబు నాయుడు కొన్ని బాధ్య‌త‌లు అప్పగిస్తార‌ని, వాటిని నిర్వ‌ర్తించేందుకు తామంతా సిద్ధ‌మ‌ని చెప్పారు. తెలుగు చిత్ర‌సీమ‌ విశాఖ‌ప‌ట్నంలోనూ అభివృద్ధి చెందుతుంద‌ని, అయితే హైద‌రాబాద్ ని మాత్రం తెలుగు పరిశ్రమ వ‌దులుకోద‌ని వ్యాఖ్యానించారు.

910


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  హీరోగా నాగ్ అశ్విన్   దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD). ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్  ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్ , ప్రియాంక దత్  ..లతో కలిసి భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్..లలో విజువల్స్ హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉండటంతో.. సినిమాకి మంచి హైప్ ఏర్పడింది. మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి.6వ రోజు కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది. 
 

1010


‘కల్కి 2898 ad’ చిత్రానికి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.315.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.69.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

click me!

Recommended Stories