అంతకు మించేలా పవన్ ఫ్యాన్స్ జల్సా 4కె క్వాలిటీ ప్రింట్ తో రచ్చ మొదలు పెట్టేశారు. పవన్ ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చూస్తుంటే.. జల్సా చిత్రం మళ్ళీ రిలీజ్ అవుతోందా అని అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2 తేదీల్లో దాదాపు 500 షోలు ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పోకిరి. సూపర్ స్టార్ ఫాన్స్ ఆ చిత్రాన్నే ఎంచుకున్నారు. పవన్ కెరీర్ లో ఖుషి బిగ్గెస్ట్ హిట్. ఆ మూవీ ఒక క్లాసిక్ కూడా. కానీ పవన్ ఫ్యాన్స్ ఖుషిని పక్కన పెట్టి..యావరేజ్ మూవీ జల్సాని ఎంచుకున్నారు.