కొరటాల శివకు హాలీడేస్ ఇచ్చిన ఎన్టీఆర్, దేవర 2 పై తారక్ ఇచ్చిన క్లారిటీ ఇదే..

First Published | Oct 5, 2024, 12:20 PM IST

దేవర సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత, దేవర 2 గురించి ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొరటాల శివకు హాలీడేస్ ఇచ్చిన తారక్.. దేవర సీక్వెల్ పై పక్కా గాక్లారిటీ ఇచ్చేశాడు. 
 

దేవర రిలీజ్ అయ్యింది. అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తోంది. పాన్ ఇండియా లో అద్భుతం చేసింది. ఇక దేవర పార్ట్ 2 సంగతి ఏంటి..? ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..? 


దేవర సినిమాతో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా అదిరిపోయే రెస్పాన్స్ ను సాదించింది. ఇప్పటికే ఈసినిమా  400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ కూడా అయింది. 

చిరంజీవిని బెదిరించి మరీ.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్న హీరోయిన్..?

ఇక ప్రస్తుతం దేవర సినిమా 500 కోట్ల టార్గెట్ గా దూసుకుపోతోంది. అయితే దేవరకు వీకెండ్ తో పాటు దసరా హాలిడేస్ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉండటంతో..  500 కోట్ల మార్క్  టార్గెట్ ను కంప్లీట్ చేయడం పెద్ద విషయం కాదు.

నిజానికి మూవీ టీమ్ పెట్టుకున్న టార్గెట్ కూడా అదే అని తెలుస్తోంది. ఈక్రమంలో  దేవర మూవీ టీమ్ రీసెంట్ గా సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించింది.

శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ సుధా ఆర్ట్స్‌ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్ , మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 200 కోట్లకు పైగా అయ్యిందని సమాచారం. 
 

సినిమాలకు రజినీకాంత్ గుడ్ బై..


ఇక దేవర సినిమా  రిలీజ్ టైమ్ లో భారీగా ప్రమోషన్స్ చేశారు టీమ్. ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూరన్ కూడా రకరకాల ఈవెంట్స్ లో పాల్గొన్నారు. అయితే అసలైన ప్రీరిలీజ్ ఈవెంట్ ను మాత్రం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంతో. .కాన్సిల్ చేయాల్సి వచ్చింది. దాంతో ఫ్యాన్స్ బాగా డిస్సపాయింట్ అయ్యారు. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ntr, devara, warning, tollywood

ఈక్రమంలో బాలీవుడ్ తో పాటు..  ఎన్టీఆర్ అమెరికాలో కూడా ప్రమోషన్స్ చేశాడు. తారక్  వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 

దేవర పార్ట్ 2 వెంటనే చేస్తారా..? దాని సంబంధింన విషయాల గురించి అడిగినప్పుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది, అందుకే  పార్ట్ 2 కూడా బాగా ప్లాన్ చేశాము.. ఇప్పటికే కథ కూడా  కంప్లీట్ వెర్షన్  సిద్దమైపోయింది, దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి అన్నారు. అంతే కాదు దేవర సినిమా షూటింగ్ టైమ్ లోనే.. దేవర  పార్ట్ 2 కి సబంధించిన లో ఓ రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయిందని అన్నారు. 

ఇక ఇన్నేళ్ళు ఈసినిమా కోసం బాగా కష్టపడ్డాం.. అందుకే  డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఓ నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు.

దీంతో కొరటాల శివకు ఎన్టీఆర్ హాలీడేస్ ఇచ్చేశాడు.. ఇక  నెక్స్ట్ తారక్  దేవర 2 నే చేస్తాడు అని క్లారిటీ వచ్చింది. అంతే కాదు  ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.

కాని ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ 2 స్టార్ట్ చేస్తే మాత్రం.. ఎన్టీఆర్ ముందు దేవర 2 సినిమా నే కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం చేస్తారో. 

Latest Videos

click me!