నాకు ప్రెగ్నెన్సీ అని తెలియగానే చరణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. మిస్టర్ సి అంటే అందుకే ఇష్టం, ఉపాసన కామెంట్స్

Published : Jun 15, 2023, 02:19 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్నారు. త్వరలో కొణిదెల వారి ఇంట వారసుడో వారసురాలో రాబోతున్నారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. 

PREV
16
నాకు ప్రెగ్నెన్సీ అని తెలియగానే చరణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. మిస్టర్ సి అంటే అందుకే ఇష్టం, ఉపాసన కామెంట్స్
Upasana Konidela

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్నారు. త్వరలో కొణిదెల వారి ఇంట వారసుడో వారసురాలో రాబోతున్నారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భిణిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. 

 

26

వివాహం జరిగిన పదేళ్ల తర్వాత చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీనితో ప్రస్తుతం అందరి చూపు ఉపాసనపైనే ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఉపాసన ప్రస్తుతం ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతోంది. 

36

తాజాగా ఉపాసన తన ప్రెగ్నన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉపాసనకు ప్రెగ్నన్సీ అని తెలియగానే రాంచరణ్ ఫస్ట్ రియాక్షన్ ఏంటో ఆమె తెలిపింది. నాకు ప్రెగ్నన్సీ వచ్చిందనిపిస్తోంది అంటూ రాంచరణ్ కి చెప్పా. చరణ్ వెంటనే దీని గురించి ఎక్కువగా ఎగ్జైట్ అవ్వొద్దు. ప్రశాంతంగా ఉండు. పరీక్షలు చేయించిన తర్వాత నిర్ధారించుకుందాం అని చెప్పాడు. 

46

అందుకే నాకు చరణ్ అంటే ఇష్టం, ఆరాధన అని ఉపాసన పేర్కొంది. నేను ఏ విషయాన్ని అయినా వెంటనే వ్యక్తం చేస్తా. కానీ చరణ్ ప్రతి విషయాన్ని చాలా కూల్ గా తీసుకుంటాడు. రాంచరణ్ వల్లే నేను లైఫ్ లో ప్రశాంతంగా, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండగలుగుతున్నా అని ఉపాసన పేర్కొంది. 

56

మెగా కుటుంబ సభ్యులు ఉపాసన ప్రెగ్నన్సీ విషయాన్ని గత ఏడాది డిసెంబర్ లో రివీల్ చేశారు. ఇటీవల ఉపాసనకి కుటుంబ సభ్యులు బేబీ షవర్ ఫంక్షన్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. 

66

నిన్ననే చరణ్ ఉపాసన 11వ వెడ్డింగ్ యానవర్సరీ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చరణ్ ఉపాసనకు ముద్దు పెడుతున్న బ్యూటిఫుల్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

click me!

Recommended Stories