శ్రీదేవి, దివ్యభారతి, సౌందర్య ఇలా అందరి జీవితం విషాదమే..కామన్ గా జరిగింది ఇదే, ఆ హీరోలతో లింక్ ?

First Published | Aug 7, 2024, 6:58 PM IST

స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించిన కొందరు హీరోయిన్లు అకాల మరణం చెందారు. వారిలో సౌందర్య, దివ్యభారతి, ఆర్తి అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఉన్నారు. శ్రీదేవి కెరీర్ ముగిసిన తర్వాత మరణించినప్పటికీ ఆమెది కూడా విషాదకర మరణమే. 

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల విషయంలో చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించిన కొందరు హీరోయిన్లు అకాల మరణం చెందారు. వారిలో సౌందర్య, దివ్యభారతి, ఆర్తి అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఉన్నారు. శ్రీదేవి కెరీర్ ముగిసిన తర్వాత మరణించినప్పటికీ ఆమెది కూడా విషాదకర మరణమే. 

అయితే సౌందర్య, దివ్యభారతి, ఆర్తి అగర్వాల్, శ్రీదేవి విషయంలో వారి కెరీర్ కామన్ గా జరిగిన ఒక అంశం ఉంది. సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. దివ్యభారతి మృతి విషయంలో ఇప్పటికి మిస్టరీ వీడలేదు. ఆమె మరణంపై అనేక పుకార్లు ఉన్నాయి. 


ఆర్తి అగర్వాల్ అయితే బరువు తగ్గడం కోసం చేయించుకున్న చికిత్స వికటించడంతో మరణించారు. ఇక శ్రీదేవి మృతి కూడా మిస్టరీనే. ఆమె దుబాయ్ లో బాత్ టబ్ లో మరణించిన సంగతి తెలిసిందే. 

ఈ నలుగురు హీరోయిన్ల కెరీర్ విషయంలో కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే.. వీళ్లంతా చిరంజీవి, వెంకటేష్ లతో నటించారు. శ్రీదేవి, ఆర్తి అగర్వాల్, సౌందర్య, దివ్య భారతి చిరంజీవితో కలసి సినిమాలు చేశారు. అదే విధంగా విక్టరీ వెంకటేష్ కూడా ఈ నలుగురితో నటించారు. దివ్యభారతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందే వెంకీ బ్లాక్ బస్టర్ చిత్రం బొబ్బిలి రాజాతో. 

ఇక వెంకటేష్ శ్రీదేవితో క్షణ క్షణం అనే చిత్రంలో నటించారు. సౌందర్య, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో అయితే వెంకీ మల్టిపుల్ మూవీస్ చేయడం విశేషం. 

Latest Videos

click me!