30 లిప్ కిస్ లు ఉన్న సినిమా..? కిస్సుల వీరుడు ఇమ్రాన్ కే షాక్ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా..?

First Published | Aug 7, 2024, 6:47 PM IST

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యధికంగా ముద్దు సీన్లు ఉన్న సినిమా ఏదో తెలుసా..? లిప్ లాక్స్ అంటే గుర్తుకు వచ్చే హీరో ఇమ్రాన్ హష్మికే షాక్ ఇచ్చిన మరో స్టార్ ఎవరో తెలుసా..? అసలేంటి ఈ కిస్సుల గోల. 

 ఈ జనరేషన్ లో సినిమా అంటే ఒక్కటంటే ఒక్కటైనా ముద్దు సీన్ ఉండాల్సిందే. లిప్ కిస్ లేకుండా సినిమాలు తీయ్యడంలేదు మేకర్స్.మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ముద్దు సన్నివేశాలు లేని సినిమా అంటూ ఉండదనే చెప్పాలి.  పోటీపడి కిస్ సీన్స్ ను బాలీవుడ్ లో పెడుతుంటారు.  సినిమా అంటే కిస్సులు, రొమాన్స్ లు.. బెడ్ సీన్స్ కామన్ అయిపోయాయి ఈకాలంలో. అలా అని ప్రతీ సినిమాలో ఇవి ఉండాలని లేదు.. అంతే కాదు  సినిమాలో ఇన్ని ముద్దుల సన్నివేశాలు మాత్రమే ఉండాలనే రూల్ లేదు. 

Tanushree Dutta Emraan Hashmi

సినిమాను బట్టి సన్నివేశాన్ని బట్టి.. కిస్ సీన్స్ పెడుతుంటారు మేకర్స్. అయితే ఇప్పటి వరకూ సినిమాల్లో ఎన్నో రికార్డ్ లుఉన్నాయి. అయితే ఈ కిస్సుల విషయంలో ఇమ్రాన్ హష్మీని బాలీవుడ్ లిప్ కిస్ కింగ్ అని పిలుస్తారు. ఇమ్రాన్ హష్మీ ఈవిషయంలో రికార్డ్ క్రియేట్ చేశాడని అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆయన నటించిన మర్డర్ సినిమా నిండా లిప్ కిస్ సీన్లు ఉన్నాయి. అయితే బాలీవుడ్‌లో దీన్ని మించిన సినిమా ఒకటి ఉంది. 
 


అవును.. మర్డర్ సినిమాను మించి కిస్ సీన్లు.. ఇమ్రాన్ నుమించి కిస్సులు పెట్టిన హీరో ఉన్నాడంటే నమ్ముతారా..? అది ఏ సినిమానో కాదు.. బాలీవుడ్  హారర్ థ్రిల్లర్ చిత్రం 3G.ఈసినిమాలో  సరిగ్గా 30 లిప్ కిస్‌లు ఉన్నాయి. ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్  హీరోగా నటించగా.. సోనాల్ చౌహాన్ జంటగా నటించారు. 

2013లో బాలీవుడ్‌లో 3జీ సినిమా విడుదలైంది. నీల్ నితిన్ ముఖేష్ మరియు సోనాల్ చౌహాన్ మధ్య ఈసినిమా అయిపోయే సరికి  30 లిప్ కిస్‌లను పంచుకున్నారు.  కిస్సింగ్‌లో ఇప్పటివరకు బాలీవుడ్‌లో విడుదలైన అన్ని రికార్డులను 3G సినిమా బద్దలు కొట్టింది. ఇమ్రాన్ హష్మీ మరియు మల్లికా షెరావత్ నటించిన రొమాంటిక్ మూవీ మర్డర్‌లో కూడా  కేవలం 20 ముద్దు సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి.

ముద్దులు, రొమాన్స్ తో సందడి చేసిన ఈ 3జీ సినిమా బాక్సాఫీస్  దగ్గర మాత్రం బోల్తా కొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళలేరు కాబట్టి.. యూత్ లో కొంత మంది మాత్రమే ఈ సినిమాను ఆదరించారుఅని చెప్పవచ్చు. మొత్తంగా ఈ సినిమా 5.9 కోట్లు వసూలు చేసింది. 3జీ సినిమాలోని ముద్దుల సీన్‌ని బ్రేక్ చేయడానికి బాలీవుడ్‌లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ సాధ్యం కాదు. 3Gకి పోటీగా సుద్ధ్ దేశీ రొమాన్స్ విడుదలైంది. ఈ సినిమాలో 27 కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి 3జీ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. రణవీర్ సింగ్ మరియు వాణి కపూర్ నటించిన బిఫికరేలో 25 ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. 
 

Latest Videos

click me!