Allu Arjun
కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ 2024 ఏపీ ఎన్నికల్లో పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపుకోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని చిరంజీవి వీడియో బైట్ విడుదల చేశాడు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేశారు.
నాగబాబు, ఆయన సతీమణి సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా రామ్ చరణ్ పిఠాపురం వెళ్ళాడు. అదే రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రధాన ప్రత్యర్థి పార్టీ వైసీపీకి అల్లు అర్జున్ పరోక్షంగా మద్దతు తెలిపాడు. నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ తరఫున పోటీ చేసిన శిల్పా రవి రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళాడు.
శిల్పా రవికి ఓటు వేసి గెలిపించాలని కోరాడు. అల్లు అర్జున్ చేసిన పని మెగా హీరోలకు మింగుడు పడలేదు. కానీ మౌనం వహించారు. మే 13న పోలింగ్ ముగిశాక నాగబాబు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ వేశాడు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే అని ఒక కామెంట్ పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో దాన్ని డిలీట్ చేశాడు.
Allu Arjun
అనంతరం సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా అకౌంట్స్ లో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మీద మెగా హీరోలు మండిపడుతున్నారనే కథనాలు వెలువడ్డాయి. ఇండస్ట్రీలో టాక్ నడిచింది. మెగా ఫ్యాన్స్ చేసే డ్యామేజ్ కి భయపడే పుష్ప 2 వాయిదా వేశారని కూడా ఊహాగానాలు వినిపించాయి.
Allu Arjun
అసలు వైసీపీ నేతకు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ విషయంలో మెగా హీరోల ఆలోచన ఏంటీ? అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై నిహారిక క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అన్నారు. అల్లు అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆయన వ్యక్తిగత విషయం. దానిపై మెగా ఫ్యామిలీలో ఎలాంటి వ్యతిరేకత లేదు, అన్నట్లు ఆమె పరోక్షంగా చెప్పింది..