రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు సింగర్ కనికా కపూర్ బెస్ట్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. కనికా వివాహ వేడుక కోసం ఉపాసన ఏకంగా లండన్ వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. యూపీకి చెందిన కనికా ఉపాసనకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఎలా అయ్యారనేది పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
యూపీకి చెందిన కనికా కపూర్ 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. భర్త రాజ్ ఛన్దోక్ లండన్ లో బిజినెస్ మాన్ కాగా అక్కడే సెటిల్ అయ్యారు. వీరికి ముగ్గురు సంతానం. మనస్పర్థలతో రాజ్ కి 2012లో విడాకులు ఇచ్చింది. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న కనికా కపూర్ ఇటీవల 43ఏళ్ల వయసులో గౌతమ్ అనే బిజినెస్ మాన్ ని వివాహం చేసుకుంది.
26
Singer Kanika Kapoor Wedding Photos
కనికా కపూర్ రెండో వివాహానికి ఉపాసన హాజరయ్యారు. నవదంపతులతో, మిత్రులతో ఫోటోలు దిగారు. కనికా పెళ్లి వేడుకలో ఉపాసన ఫోటోలు వైరల్ అయ్యాయి. లేటెస్ట్ గా కనికాను ఉద్దేశిస్తూ తమది ఎప్పటికీ వీడని గొప్ప రిలేషన్ అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు ఉపాసన. అసలు ఈ కాంట్రవర్సియల్ సింగర్ ఉపాసనకు ఫ్రెండ్ ఎప్పుడయ్యారనే సందేహాలు మొదలయ్యాయి.
36
గతంలో కనికా కపూర్-ఉపాసన కలిసిన సందర్భాలు లేవు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే బిజినెస్ ఉమన్ గా ఉపాసనకు ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. అలాగే కనికా నార్త్ ఇండియాకు చెందిన పెద్ద బిజినెస్ గ్రూప్ కుటుంబానికి చెందిన వారసురాలు. ఆ విధంగా ఆమెకు కనికాతో స్నేహం కుదిరి ఉండవచ్చు.
46
కాగా 2020 లాక్ డౌన్ సమయంలో కనికా కపూర్ వివాదాల్లో చిక్కుకున్నారు. కరోనా భయంతో ప్రపంచం వణుకుతున్న దశలో కనికా లండన్ నుండి ఇండియా వచ్చారు. వచ్చిన వెంటనే పలు పార్టీల్లో పాల్గొన్నారు. చివరికి ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడం పెద్ద సంచలనంగా మారింది. నెటిజెన్స్ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు.
56
ఇంతటి భయానక పరిస్థితులలో కనీస బాధ్యత లేకుండా కనికా పార్టీల్లో పాల్గొనడం ఏమిటంటూ విమర్శల దాడికి దిగారు. ఆమె కుటుంబం బెదిరింపులను ఎదుర్కొంది. కనికా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు చావు అంచులకెళ్లి తిరిగొచ్చారు . కనికా జీవితంలో అది పెద్ద వివాదమని చెప్పొచ్చు.
66
కనికా తాను పాలొన్న పార్టీలకు సంబంధించిన సమాచారం కూడా తప్పుగా చెప్పారు. లండన్ నుండి వచ్చాక ఆమె ఉన్న హోటల్ లోనే సౌత్ ఆఫ్రికా టీమ్ సభ్యులు స్టే చేశారు. అలా ఆమె వ్యవహారం వివాదాస్పదమైంది. కాగా పుష్ప హిందీ వెర్షన్ లో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ ని కనికా పాడటం విశేషం.