బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? లైఫ్ అలా మారిపోయింది!

Published : Feb 29, 2024, 07:03 PM ISTUpdated : Feb 29, 2024, 07:41 PM IST

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతను ఎలా ఉన్నాడు? అనే ఆసక్తి అందరిలో ఉంది. మరి రైతు బిడ్డ జీవితం బిగ్ బాస్ షో తర్వాత ఎలా ఉందో చూడండి...   

PREV
17
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? లైఫ్ అలా మారిపోయింది!
Pallavi Prashanth

బిగ్ బాస్ సీజన్ 7 సంచలనాల సమాహారం. ఒక కామనర్ పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టడం ఊహించని పరిణామం. టాప్ సెలెబ్స్ ని కాదని పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. పొలాల్లో పని చేసుకునే రైతు బిడ్డ ఈ ఫీట్ సాధిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. 

 

27
Pallavi Prashanth

పల్లవి ప్రశాంత్ కప్ గెలవడం ఒక సంచలనం అయితే... అతని అరెస్ట్ అంతకు మించిన సంచలనం. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్లకు పల్లవి ప్రశాంత్ కారణం అంటూ అతన్ని అరెస్ట్ చేశారు. రెండు రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. గెలిచిన ఆనందం లేకుండా పోయింది. 

37
Bigg Boss Telugu 7

జైలు నుండి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ కొన్నాళ్ళు హైదరాబాద్ లోనే ఉన్నాడు. తన బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో విందులు వినోదాల్లో పాల్గొన్నాడు. అలాగే స్టార్ మా రూపొందించిన స్పెషల్ ఈవెంట్స్ లో పల్లవి ప్రశాంత్ సందడి చేశాడు. ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 
 

47


ఈ మధ్య బుల్లితెరపై పల్లవి ప్రశాంత్ కనిపించడం తగ్గింది. ఆయన ఇంటర్వ్యూలలో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. మరి పల్లవి ప్రశాంత్ ఏం చేస్తున్నాడు. బిగ్ బాస్ తర్వాత అతని జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంది. పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడో మనం తెలుకోవచ్చు. 

57
Pallavi Prashanth

పల్లవి ప్రశాంత్ లైఫ్ చాలా మారిపోయింది. కారుల్లో తిరుగుతున్నాడు. ఎక్కడకు వెళ్లినా జనాలు గుర్తు పడుతున్నారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. సమ్మక్క సారక్క జాతరకు కూడా పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళాడు. 
 

67
Pallavi Prashanth


సెలబ్రిటీ హోదా అనుభవిస్తూనే పల్లవి ప్రశాంత్ తన వృత్తిని కొనసాగిస్తున్నాడు. తన పొలంలో పని చేస్తున్నాడు. ఈ మధ్య పల్లవి ప్రశాంత్... పేరెంట్స్ తో కూడా రీల్స్ చేయిస్తున్నాడు. సదరు రీల్స్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తుండగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అమ్మానాన్నలతో బంతి పూల తోటలో ఓ వీడియో చేశాడు. 

77
Pallavi Prashanth


కాగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ప్రైజ్ మనీ పేదలకు పంచుతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పను అంటూ పోస్ట్ పెట్టాడు. మరి ఆ దిశగా అతడు అడుగులు వేసిన దాఖలాలు లేవు. పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు గెలిచాడు. అందులో మినహాయింపులు పోగా మిగిలింది... పంచాల్సి ఉంది. 

click me!

Recommended Stories