అందగాడు శోభన్ బాబును ఎగతాళి చేసిన చిరంజీవి హీరోయిన్... ఆయన రియాక్షన్ ఏమిటో తెలుసా?

Published : Mar 14, 2024, 02:59 PM IST

అప్పట్లో హీరో శోభన్ బాబును అందానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునేవారు. అలాంటి శోభన్ బాబును ఒక హీరోయిన్ ఎగతాళి చేసేదట. ఈ విషయాన్ని సీనియర్ హీరోయిన్ జయసుధ వెల్లడించారు.   

PREV
16
అందగాడు శోభన్ బాబును ఎగతాళి చేసిన చిరంజీవి హీరోయిన్... ఆయన రియాక్షన్ ఏమిటో తెలుసా?
Sobhan Babu


శోభన్ బాబు ఫ్యామిలీ చిత్రాల హీరోగా భిన్నమైన ఇమేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై రాణించారు. శోభన్ బాబు సినిమా అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే. లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ చిత్రాల్లో ఆయన ఎక్కువగా నటించారు. అలాగే మల్టీస్టారర్స్, మాస్ చిత్రాలు కూడా చేశారు. 

26
Sobhan Babu

శోభన్ బాబుకు అత్యంత అందమైన హీరోగా పేరుండేది. టాలీవుడ్ హీరోల్లో గ్లామర్ విషయానికి వస్తే శోభన్ బాబు తర్వాతే. అప్పట్లో శోభన్ బాబు హెయిర్ స్టైల్, రింగు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేవారు. అలాంటి శోభన్ బాబునుకు ఒక హీరోయిన్ ఎగతాళి చేసేదట. శోభన్ బాబునే ఆట పట్టించిన ఆ హీరోయిన్ ఎవరో జయసుధ చెప్పింది. 

 

36

శోభన్ బాబుతో పదుల సంఖ్యలో చిత్రాలు చేసిన జయసుధ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె శోభన్ బాబుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. సెట్స్ లో శోభన్ బాబు చాలా సరదాగా ఉండేవారట. ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువేనట. జయసుధ, శోభన్ బాబు పిచ్చాపాటిగా మాట్లాడుకునేవారట. 

46
Radhika

అయితే హీరోయిన్ రాధిక మాత్రం శోభన్ బాబును ఆటపట్టించేదట. బన్ బాబు అని పిలుస్తూ ఎగతాళి చేసేదట. రాధిక బన్ బాబు అని పిలవగానే అందరూ గట్టిగా నవ్వేసేవారట. శోభన్ బాబు కూడా నవ్వేవారట. ఆయన చాలా సరదాగా తీసుకునేవారట. ఈ విషయాన్ని జయసుధ చెప్పుకొచ్చారు. 
 

56
Sobhan Babu


ఒకరోజు శోభన్ బాబు దగ్గరకు చంద్ర మోహన్ వెళ్లారట. జయసుధను ఒకసారి కాల్ చేయమని చెప్పు అని చంద్రమోహన్ కి ఆయన చెప్పారట. చంద్రమోహన్ జయసుధకు ఈ విషయం చెప్పారట. బిజీగా ఉన్న జయసుధ మర్చిపోయి కాల్ చేయలేదట. మరో వారం రోజుల్లోనే శోభన్ బాబు కన్నుమూశారట. 

66

శోభన్ బాబు మృతి తీవ్ర వేదనకు గురి చేసిందని జయసుధ చెప్పుకొచ్చారు. శోభన్ బాబుకు డాక్టర్స్, ఆసుపత్రులు అన్నా కూడా భయమట. వైద్యానికి వెళ్ళడానికి వెనకాడేవారని జయసుధ చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ విషయంలో శోభన్ బాబు విలువైన సలహాలు ఇచ్చారని జయసుధ చెప్పుకొచ్చారు.

click me!

Recommended Stories