రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్.. ఆరుగురు స్టార్ డైరెక్టర్స్ తో పని చేసిన ఆ హీరో మాత్రం స్టార్ కాలేకపోయాడు

First Published | Aug 17, 2024, 11:42 PM IST

ఆ హీరో ఇండస్ట్రీని ఏలిన ఆరుగురు స్టార్ డైరెక్టర్స్ తో పని చేశాడు. ఈ లిస్ట్ లో రాజమౌళి, పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ వంటి స్టార్స్ ఉన్నారు. అయినా స్టార్ కాలేకపోయాడు. ఆ హీరో ఎవరో తెలుసా?
 

కొందరు దర్శకులు ఒక్క సినిమాతో ఓ హీరో ఫేట్ మార్చేస్తారు. కాగా ఓ హీరో ఏకంగా ఆరుగురు స్టార్ దర్శకులతో పని చేశాడు. కానీ స్టార్ కాలేకపోయాడు. అతడు ఎవరో కాదు నితిన్. నితిన్ రెండో చిత్రం దిల్. వివి వినాయక్ తెరకెక్కించిన దిల్ సూపర్ హిట్. నితిన్ కి ఆ చిత్రం ఫేమ్ తెచ్చింది. కానీ స్టార్డం తేలేదు. 

కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ ఆంజనేయం మూవీ చేశాడు. అప్పట్లో కృష్ణవంశీ టాప్ దర్శకుల్లో ఒకరు. ఆయన తెరకెక్కించిన డివోషనల్ డ్రామా శ్రీ ఆంజనేయం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఫలితం మాత్రం నిరాశపరిచింది. శ్రీ ఆంజనేయం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.


Nithiin

దర్శకుడు రాజమౌళితో మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు నితిన్. రాజమౌళికి సై మూడో మూవీ. సై మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సై తర్వాత నితిన్ స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరుతాడని భావించారు. కానీ అలా జరగలేదు. సై తర్వాత మరో స్టార్ డైరెక్టర్ తో పని చేసే అవకాశం దక్కింది. 

అల్లరి బుల్లోడు చిత్రాన్ని కే రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. ఈ మూవీలో నితిన్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేశాడు. త్రిష, రతి హీరోయిన్స్ గా నటించారు. కే రాఘవేంద్రరావు చేసిన ఈ ప్రయోగం వికటించింది. అల్లరి బుల్లోడు డిజాస్టర్. 

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-నితిన్ కాంబోలో వచ్చిన చిత్రం హార్ట్ అటాక్. పూరి జగన్నాధ్ ఎప్పటిలాగే హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా డిజైన్ చేశాడు. ఆదా శర్మ హీరోయిన్ గా నటించిన హార్ట్ అటాక్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. 

nithin

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హీరో పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా ప్రచారమైన నితిన్ కి ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో నితిన్ తో త్రివిక్రమ్ ఒక చిత్రం చేశాడు. వీరి కాంబోలో విడుదలైన అఆ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందరు స్టార్ దర్శకులతో నితిన్ పని చేసినా స్టార్ కాలేకపోవడానికి కారణం సక్సెస్ రేట్. ఒక హిట్ పడితే నితిన్ ని అరడజను ప్లాప్స్ వెంటాడతాయి.. 

Latest Videos

click me!