కథ నచ్చకపోవడం ఒక కారణం అయితే.. అంతకు ముందే బి గోపాల్ సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఫ్యాక్షన్ కథలు చేసి ఉన్నారు. మరోసారి ఫ్యాక్షన్ ఎందుకు అనేది ఆయన ఫీలింగ్. దీనికి తోడు చిరంజీవితో తెరకెక్కించిన మెకానిక్ అల్లుడు చిత్రం డిజాస్టర్ అయింది. మరోసారి చిరంజీవితో చెత్త కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుందేమో, విమర్శలు వస్తాయి ఏమో అని బి గోపాల్ భయపడ్డారు. చిరంజీవి గారికి ఈ కథ చెప్పొద్దు, నేను ఈ చిత్రం చేయలేను అని బి గోపాల్ పరుచూరి బ్రదర్స్ కి చెప్పేశారు.