Jayamalini: సీనియర్ నటి జయమాలిని ఒకప్పుడు తెలుగు సినిమాని ఉర్రూతలూగించిన నటి. తన గ్లామర్‌తో వెండితెరని రక్తి కట్టించిన నటి. ఆమె ముఖ్యంగా ఐటెమ్స్ సాంగ్స్ తో పాపులర్ అయ్యింది. హీరోయిన్‌గా, ముఖ్య పాత్రల్లోనూ నటించినప్పటికీ ఆమె స్పెషల్ సాంగ్స్ విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి.
జయమాలిని ఉందంటే ఆ మూవీలో మాస్ ఆడియెన్స్ కి కావాల్సిన మసాలా ఉందని అంతా ఫిక్స్ అయ్యేవాళ్లు. అదే స్థాయిలో థియేటర్లకి క్యూ కట్టేవాళ్లు. అంతగా రెండు మూడు దశాబ్దాల పాటు సౌత్ సినిమాని శాషించింది జయమాలిని. పెళ్లి తర్వాత అడపాదడపా కనిపించినా, ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమవుతున్నారు.