రాంచరణ్ నటించే మూవీ సెట్ కి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన క్రేజీ హీరో.. మెగా ఫ్యామిలీ వ్యక్తి కాదు, కానీ

First Published | Nov 20, 2024, 7:52 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో 2007లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం సూపర్ హిట్ అయింది. రాంచరణ్ ఎంట్రీ అదిరిపోయింది. రెండవ చిత్రం అంతకి మించినట్లుగా ఉండాలి అన్నట్లు ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో 2007లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం సూపర్ హిట్ అయింది. రాంచరణ్ ఎంట్రీ అదిరిపోయింది. రెండవ చిత్రం అంతకి మించినట్లుగా ఉండాలి అన్నట్లు ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు రాంచరణ్ సెకండ్ మూవీ రాంచరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన మగధీర చిత్రం అప్పటికి 80 ఏళ్ళ చరిత్ర ఉన్న టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. 

ఈ చిత్రం కోసం రాజమౌళి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రాంచరణ్ కూడా స్టంట్స్ కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. కొన్ని రియల్ షాట్స్ చేశాడు. రాజమౌళి అనుకున్నట్లు ఈ చిత్రాన్ని తీయగలగడంతో మూవీ సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు రాజమౌళి టెన్షన్ మొత్తం బడ్జెట్ గురించే అట. ఎందుకంటే అప్పటికి ఇండస్ట్రీలో 40 కోట్ల బడ్జెట్ అంటే మామూలు రిస్క్ కాదు. మగధీర షూటింగ్ జరుగుతున్నపుడు మరో క్రేజీ హీరో సెట్స్ కి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లేవారట. ఆ హీరో ఎవరో కాదు శ్రీహరి. మగధీర చిత్రంలో శ్రీహరి నటించారు. 


ఆయన షూటింగ్ లేకపోయినా కొన్నిసార్లు శ్రీహరి సెట్స్ కి వచ్చేవారట. రాజమౌళి, అల్లు అరవింద్, రాంచరణ్ తర్వాత మగధీర చిత్రాన్ని అంత రెస్పాన్సిబుల్ గా తీసుకున్న వ్యక్తి శ్రీహరి. ముఖ్యంగా రాంచరణ్ విషయంలో శ్రీహరి చాలా కేరింగ్ చూపించారట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చరణ్, శ్రీహరి ఇద్దరూ తెలిపారు. కొన్నిసార్లు శ్రీహరి షూటింగ్ లేకపోయినా ఆయన సెట్స్ కి వచ్చేవారట. యాక్షన్ సీన్లు జరుగుతున్నప్పుడు శ్రీహరి స్వయంగా రోప్ లు, ఇతర సేఫ్టీ వ్యవహారాలు అన్నీ గమనిస్తూ ఫైట్ మాస్టర్స్ కి వార్నింగ్ ఇచ్చేవారు. 

Magadheera

రాంచరణ్ ఒక రోజు శ్రీహరిని అడిగారట.. మీకెందుకు సార్ ఇందంతా.. ఫైట్ మాస్టర్స్ చూసుకుంటారు కదా అని అడిగితే.. లేదు చరణ్.. నీకు ఏమైన జరిగితే మీ నాన్న దగ్గర నాదే బాధ్యత.. ఆయనకి నేనే సమాధానం చెప్పాలి అని చెప్పారట. ఫైట్ మాస్టర్స్ ని తరచుగా వార్నింగ్ ఇస్తూ వాళ్ళని స్టంట్స్ విషయంలో అలెర్ట్ చేసేవారు. తాను చిన్నప్పుడు శ్రీహరి గారితో కలసి జిమాస్టిక్స్ ట్రైనింగ్ కి వెళ్ళేవాడిని అని రాంచరణ్ తెలిపారు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. శ్రీహరి టాలీవుడ్ లో రియల్ స్టంట్స్ చేసే హీరోల్లో ఒకరు. 

ఫిట్ నెస్, జిమ్ విషయంలో శ్రీహరి ప్లానింగ్ తో ఉంటారు. శ్రీహరి కూడా మగధీపై స్పందిస్తూ.. రాంచరణ్ యాక్షన్ చేస్తుంటే ముందుగా వెళ్లి రోప్ లు చెక్ చేసేవాడిని. చరణ్ స్టంట్స్ చేస్తుంటే భయం వేసేది. చాలా రిస్క్ చేశాడు. మీరెందుకు అంకుల్ వాళ్ళు చూసుకుంటారు కదా అని చరణ్ అడిగితే ఒకటే సమాధానం చెప్పా. నీకు చిన్న ప్రమాదం జరిగినా మీ నాన్న నన్ను అడుగుతారు. శ్రీహరి ఉన్నాడు కదా చూసుకోలేదా అని అంటారు అంటూ సమాధానం ఇచ్చాడు. చిరంజీవితో శ్రీహరికి అంత మంచి అనుబంధం ఉంది. 

Latest Videos

click me!