'గేమ్ ఛేంజ‌ర్‌' అల్టిమేట్ ట్విస్ట్: శంకర్ మాస్టర్ స్ట్రోక్ !

First Published | Nov 20, 2024, 6:07 AM IST

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో హైదరాబాద్ లో జరిగిన హైడ్రా ఎపిసోడ్ తరహా సన్నివేశం ఉండనున్నట్లు టాక్. అయితే ఈ ఎపిసోడ్స్ పూర్తిగా కల్పిత కథ అని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా, తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

ఎప్పుడైతే  రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ బయిటకు వచ్చిందో అప్పటినుంచే ఈ సినిమా సంబందించి గేమ్ మొదలైపోయింది.  టీజర్ రిలీజ్ అయ్యినప్పటి నుంచి ట్రెండింగ్ లో ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. మూడు భాషల్లో టీజర్ రిలీజవ్వగా అన్ని భాషల్లో కలిపి గేమ్ ఛేంజర్ టీజర్ 24 గంటల్లో ఏకంగా 70 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సెట్ చేసింది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ఈ సినిమా గురించిన వార్తలు బయిటకు వస్తున్నాయి. . అలాంటివాటిల్లో వైరల్ అవుతున్న ఓ విషయం గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాని  దర్శకుడు శంకర్ (Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా, సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథతో రూపొందించారు. రామ్ చరణ్ ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా తన నటనలో కొత్త కోణం చూపించబోతున్నాడు.

Latest Videos


#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

 అసలు విషయానికి వస్తే ఈ  సినిమాలో రీసెంట్ గా హైదరాబాద్ లో చోటు చేసుకున్న హైడ్రా ఎపిసోడ్ తరహా ఎపిసోడ్ ఒకటి  ఉండనున్నట్లు టాక్ వస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేతల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ డిజైన్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 అయితే, ఈ ఎపిసోడ్స్ పూర్తిగా కల్పిత కథగా మాత్రమే చిత్రీకరించినట్లు చిత్ర టీమ్ స్పష్టం చేసింది. ఇందులో చరణ్ పాత్ర ప్రభుత్వం తరపున చేసిన చాలా రూత్ లెస్ గా వ్యవహరిస్తూ అవినీతికి, అక్రమాలకు అడ్డుగా ఉంటాడని చెప్తన్నారు.   

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏమిటంటే..ఇలా అక్రమ కట్టడాలు కూల్చడం ఎపిసోడ్...ఇప్పుడు హైడ్రాను చూసి ప్రేరణ పొంది రాసుకున్నది కాదట. తెలంగాణా గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోకముందే అనుకుని  షూట్ కూడా పూర్తి చేసినవి.

ఓ రకంగా సినిమాకు బాగా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్ పనికివస్తుందని టీమ్ భావిస్తోందిట. ఇదీ శంకర్ మాస్టర్ స్ట్రోక్ అని అంటున్నారు. ఇందులో ఫలానా పొలిటికల్ పార్టీ అని కానీ, ఫలానా రాజకీయ నాయకుడు అని కానీ ఎక్కడా ప్రస్తావన రాదట. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

 
 అలాగే ఈ చిత్రం రామ్ చరణ్ పాత్ర కు ప్లాష్ బ్యాక్ ఉంటుందని, తండ్రికి జరిగిన అన్యాయానికి రివోల్ట్ అవటం అనేది కూడా చూపెడతారట. అలాగే చరణ్ పాత్ర చాలా ఎగ్రిసివ్ గా ఉండబోతోందిట.

కాలేజి గొడవలు కూడా చూపబోతున్నారు. ఆ తర్వాత ఐపీఎస్ గా  అవటం, చివ‌రికి.. ముఖ్యమంత్రి సీట్ లో  కూర్చోవడం వంటివి జరుగుతాయట. ఇవన్నీ సినిమాలో వచ్చే హైలెట్ అంశాలుగా చెప్తున్నారు. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

రోబో, అపరిచితుడు  వంటి హిట్ చిత్రాలకు దుమ్ము రేపిన  శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులలోనూ ఖచ్చితంగా చూడాలనే కోరికను పుట్టిస్తోంది.  దాంతో కొంతమంది తమిళ చిత్రనిర్మాతలు తమ రిలీజ్ ప్లాన్ లను ను ఎడ్జెస్ట్ చేసుకుంటున్నారు.

అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ...రామ్ చరణ్, శంకర్ కొలాబిరేషన్ అంటే ఖచ్చితంగా మార్కెట్ ని గ్రాబ్ చేసే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ టైమ్ లో ఆ సినిమాతో పోటీపడితే రెవిన్యూలు తగ్గుతాయని తమిళ స్టార్స్ కు తెలుసు. అందుకే వెనక్కి తగ్గి దారి ఇస్తున్నారు అన్నారు.

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే రివేంజ్ స్టోరీ అని,శంకర్ మార్కు ఎలిమెంట్స్ తో సినిమా నడుస్తుందని కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే ఫార్ములా స్టోరీ అని చెప్తున్నారు. ఏదైమైనా అప్పన్నగా రామ్ చరణ్ విశ్వరూపం చూడబోతున్నామన్నమాట. 


ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట.

click me!