రెహ్మాన్‌, ధనుష్‌, నాగచైతన్య.. ఇటీవల డైవర్స్ తీసుకున్నా స్టార్స్ ఎవరో తెలుసా?

First Published | Nov 20, 2024, 12:03 AM IST

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విడాకులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ రెహ్మాన్‌ విడాకులు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల డైవర్స్ తీసుకున్న స్టార్స్ ఎవరో చూద్దాం. 
 

Saira Banu Divorce

`స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌` సినిమాతో ఇండియాకి ఆస్కార్‌ అవార్డుని తీసుకొచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ ఆర్‌ రెహ్మాన్‌ తాజాగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన భార్య సైరా బాను విడాకులను ప్రకటించింది. ముప్పై ఏళ్ల బంధానికి గుడ్‌ బై చెప్పింది. ఒత్తిడి, తీరిక లేని తనం కారణంగా ఈ ఇద్దరు విడిపోయినట్టుగా తెలుస్తుంది. అసలు నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది. 

ఇటీవల విడాకులతో మరో కోలీవుడ్‌ స్టార్‌ ఝలక్ ఇచ్చారు. హీరో జయం రవి తన విడాకులను ప్రకటించారు. 15ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్‌ చెబుతూ, తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చాడు జయం రవి. అయితే ఆయన మరో అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కారణంగానే భార్యకి విడాకులు ఇచ్చారని టాక్‌. 
 


nayanthara

ధనుష్‌ కూడా విడాకులు ప్రకటించారు. ఆయన తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్‌తో విడాకులు ప్రకటించారు. సుమారు 18ఏళ్ల బంధానికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ, రెండేళ్ల క్రితమే ఈ ఇద్దరు విడాకులు ప్రకటించారు. అయితే వీరిద్దరు మళ్లీ కలుస్తారనే రూమర్స్ వచ్చాయి. దీనిపై క్లారిటీ రానుంది.

మరో హీరో, మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌ కూడా విడాకులు తీసుకున్నారు. 2013లో సైంధవిని ప్రకాష్‌ పెళ్లిచేసుకున్నారు. 11ఏళ్లు హ్యాపీగానే ఉన్నారు. ఇటీవలే తన విడాకులు ప్రకటించారు. 

Naga Chaitanya

నాలుగేళ్ల క్రితం నాగచైతన్య కూడా విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. సమంతతో విడిపోతున్నట్టు వెల్లడించారు. దాదాపు నాలుగేళ్లు తర్వాత సేమ్‌ అక్టోబర్‌లోనే విడాకులు ప్రకటించారు. ఇప్పుడు ఎవరికి వాళ్లు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు చైతూ ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. శోభితా దూళిపాళ్లని ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నారు. 

Read more: A. R. Rahman Divorce : భార్యకు `ఆస్కార్‌` విన్నర్‌ విడాకులు.. 30ఏళ్ల బంధానికి గుడ్‌ బై

also read: ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లతో నటించి షేక్‌ చేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? పడిలేస్తున్న కెరటం

Latest Videos

click me!