తిమ్మరాజుపల్లి టీవీ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతోంది. క్రిటికల్‌గా ప్రశంసలందుకున్న ఈ చిత్రం డీసెంట్‌గా వసూళ్లని రాబడుతోంది. మరి నాలుగు రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న తిమ్మరాజులపల్లి టీవీ
కొత్త ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు కలిసి రూపొందించిన చిత్రం `తిమ్మరాజుపల్లి టీవీ`. హీరో కిరణ్ అబ్బవరం ఈ మూవీని నిర్మించడం విశేషం. వి మునిరాజు దర్శకుడిగా పరిచయం కాగా, సాయితేజ, వేద జలంధర్, ప్రదీప్ ఇలా చాలా మంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు ఈ మూవీ ద్వారా పరిచయం అయ్యారు. గత వారం విడుదలైన చిత్రాల్లో ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటుతోంది. రోజు రోజుకి కలెక్షన్లు పెరగడం విశేషం.
24
తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కలెక్షన్లు
`తిమ్మరాజుపల్లి టీవీ` మూవీకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతోంది. లిమిటెడ్ థియేటర్లో విడుదలైనా, తెలిసిన కాస్టింగ్ లేకపోయినా ఈ చిత్రానికి డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమాకి నాలుగు రోజుల్లో రూ.1.30కోట్లు రావడం విశేషం. మొదటి వీకెండ్‌లో పుంజుకున్న ఈ చిత్రం సోమవారం కూడా బుకింగ్స్ స్టడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం నెమ్మదిగా మరింతగా దూసుకుపోయే ఛాన్స్ ఉంది. సోమవారం ఒక్క రోజే ఇప్పటికే బుకింగ్స్ ద్వారా రూ.14లక్షలు వచ్చాయి. ఇది సాయంత్రానికి పెరిగే అవకాశం ఉంది.
34
సక్సెస్ అయిన కిరణ్ అబ్బవరం
ఈ మూవీకి సుమారు రెండున్నర నుంచి మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందించారట. బిజినెస్ కూడా అయ్యింది. థియేట్రికల్‌గా నాలుగు రోజుల్లోనే కోటిన్నర వచ్చింది. అంటే ఈ మూవీ హిట్ దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. ఈ వారం కూడా ఇది బాగానే రన్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మూవీ క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. ఇప్పుడు కమర్షియల్‌గానూ సేఫ్‌లోనూ ఉండబోతుందని తెలుస్తోంది. హీరో కిరణ్ అబ్బవరం కొత్తవారిని పరిచయం చేస్తూ, వారికి లైఫ్ ఇస్తూ చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు.
ఇక తిమ్మరాజుపల్లి టీవీ మూవీ విషయానికి వస్తే ఇది రాయలసీమలోని తిమ్మరాజుపల్లి అనే ఊర్లో సాగుతుంది. ఆ ఊర్లో టీవీ లేదు. హీరోయిన్ అన్న కొత్తగా టీవీ కొంటాడు. దీంతో ఊరంతా వాళ్ల ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తుంటారు. దీంతో అతను తన భార్యతో కూడా గడపలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో హీరో.. హీరోయిన్ కోసం వాళ్ల ఇంటికి టీవీ చూడ్డానికి వెళ్లినప్పుడు గొడవఅవుతుంది. ఆ రాత్రినే టీవీ కనిపించకుండా పోతుంది. ఆ టీవీని హీరోనే దొంగిలించాడని అంతా భావిస్తారు. దొంగగా నిందవేస్తాడు. ఆ నిందని పోగొట్టుకునేందుకు ఆయన ఏం చేశాడు? టీవీని కొట్టేసింది ఎవరు? తన ప్రియురాలిని ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది మూవీ.