Atlee: దర్శకుడు అట్లీ రెండోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య ప్రియ పండండి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. దీంతో వారి ఫ్యామిలీలో ఆనందం రెట్టింపు అయ్యిందని చెప్పొచ్చు.
సంచలన దర్శకుడు అట్లీ ఇప్పుడు మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య ప్రియ సోమవారం ఆమె పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పటికే వీరు కొడుకు మీర్‌కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి తండ్రి కావడంతో అట్లీ ఫ్యామిలీలో ఆనందం డబుల్ అయ్యింది. ప్రస్తుతం అట్లీ.. అల్లు అర్జున్‌తో `రాకా` సినిమాని రూపొందిస్తున్నారు. ఓ వైపు గ్లోబల్ ఫిల్మ్ చేస్తూ అంతర్జాతీయంగా సత్తా చాటబోతుండగా, మరోవైపు తన ఇంట్లోకి మహాలక్ష్మి రావడంతో వారి అట్లీ ఫ్యామిలీ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
24
మీర్ ఇప్పుడు 'పెద్దన్నయ్య'
తనకు కూతురు పుట్టిన విషయాన్ని అట్లీ సోషల్ మీడియా ద్వారా ఎంతో క్యూట్‌గా ప్రకటించారు. తన కుమారుడు మీర్ ఇప్పుడు 'పెద్దన్నయ్య' అయ్యాడంటూ, "బ్లెస్డ్.. నాకు చెల్లి వచ్చింది!" అనే క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. 2014లో వివాహం చేసుకున్న ఈ జంటకు, 2023లో మీర్ జన్మించగా, ఇప్పుడు పాప రాకతో అట్లీ కుటుంబం పరిపూర్ణమైంది. ఈ వార్త విన్న సమంత, కాజల్ అగర్వాల్, అనన్య పాండే వంటి తారలు అట్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
34
'రాకా' సెట్స్‌లో డబుల్ సెలబ్రేషన్
అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'రాకా'. ఈ సినిమా టీమ్‌లో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 19న ఈ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్న దీపికా పదుకొణె తాను రెండోసారి గర్భవతినని ప్రకటించారు. ఒక్క రోజు గ్యాప్‌తో సోమవారం దర్శకుడు అట్లీ తండ్రి అయ్యారు. ఒక్క రోజు వ్యవధిలోనే అటు దర్శకుడు, ఇటు హీరోయిన్ ఇద్దరూ తీపి కబురు అందించడం విశేషం. ఇది `రాకా` మూవీ సెట్‌లో డబుల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పొచ్చు.
తగ్గేదేలే అంటున్న దీపికా.. షేక్ చేస్తున్న బన్నీ లుక్!
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా దీపికా పదుకొణె ఎక్కడా తగ్గడం లేదు. సినిమా షెడ్యూల్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఆమె రిస్క్ తీసుకుని మరీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొంటున్నారు. ఆమె డెడికేషన్‌ను చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోతోంది. మరోవైపు, ఇటీవల బన్నీ పుట్టినరోజున విడుదలైన 'రాకా' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ముఖ్యంగా అందులో అల్లు అర్జున్ గుండుతో కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027లో థియేటర్లలోకి రానుంది. వ్యక్తిగతంగా, వృతిపరంగా ఈ ఏడాది దర్శకుడు అట్లీకి చాలా స్పెషల్‌గా నిలిచిందని చెప్పొచ్చు.