ఇక తాజాగా వర్ధమాన నటి ప్రగ్యా నయన్ (Pragya Nayan) కూడా విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు సై అంటున్నారు. ‘సురాపానం’ చిత్రంతో క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘చక్రవ్యూహం’,‘దిల్ వాలే’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘దిల్ వాలే’ సినిమా షూటింగ్ కోసం విశాఖకు వెళ్లిన ఈ బ్యూటీ ఓమీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టాలీవుడ్ లో అందరూ హీరోలతో పనిచేయాలని ఉంటుంది.. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని తెలిపారు. ఇక బన్నీ అంటే ఇష్టమని, పవన్ కళ్యాణ్ సినిమాలోనూ అవకాశం వస్తే వదులుకోనన్నారు.