షాక్ : సంక్రాంతి రేసు నుంచి ఆ రెండు సినిమాలు అవుట్?

Published : Dec 12, 2023, 06:04 AM IST

 ఓ రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోబోతున్నట్లు ట్రేడ్ లోనూ, మీడియాలో ప్రచారం జరుగుతోంది. అసలు సంక్రాంతికి రిలీజ్  అనుకున్న చిత్రాలు ఏమిటి..ఏమి తప్పుకునే అవకాసం ఉందో చూద్దాం.

PREV
19
 షాక్ : సంక్రాంతి రేసు నుంచి ఆ రెండు సినిమాలు అవుట్?
Sankranthi 2024 Movies

సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఓకే అనుకున్న సినిమా సైతం భాక్సాఫీస్ దగ్గర సింహంలా గర్జిస్తుంది. ఓ మాదిరి కంటంట్ ఉన్నా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోతుంది. ఈ విషయం దర్శక,నిర్మాతలకు తెలుసు. మరీ ముఖ్యంగా హీరోలకు సంక్రాంతి అంటే అందుకే ఇష్టం. సంక్రాంతి సెంటిమెంట్ అంటూంటారు.  ఈ క్రమంలో చాలా కాలంగా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు కీలకమైన పండుగదా  సంక్రాంతి (Sankranti Festival 2024) నిలిచిపోయింది. ఈ క్రమంలో పెద్ద హీరోలు అందరూ ఈ ఫెస్టివల్‍కే తమ సినిమాలను విడుదల చేసేందుకు ట్రై చేస్తుంటారు. 
 

29
Sankranthi 2024 Movies


వచ్చి వెళ్లిన  సంక్రాంతికి బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తెగింపు, ఇళయదళపతి విజయ్ వారసుడు సినిమాలు పోటీ పడ్డాయి.   ఈ క్రమంలో  వచ్చే ఏడాది అంటే సంక్రాంతి 2024కు పోటీ పడే సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఈ సంక్రాంతి కి రిలీజ్ కాబోయే సినిమాలు అంటూ డేట్స్ కూడా చెప్పేసారు. అయితే ఇప్పుడు ఓ రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోబోతున్నట్లు ట్రేడ్ లోనూ, మీడియాలో ప్రచారం జరుగుతోంది. అసలు సంక్రాంతికి రిలీజ్  అనుకున్న చిత్రాలు ఏమిటి..ఏమి తప్పుకునే అవకాసం ఉందో చూద్దాం.

39


గుంటూరు కారం

అందరూ ముందునుంచి అనుకున్నట్లుగానే పక్కా తెలుగు చిత్రం అనే ట్యాగ్ తో వస్తున్న గుంటూరుకారం సైతం సంక్రాంతికి వస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‍లో వస్తున్న మూడో చిత్రమే గుంటూరు కారం (Guntur Kaaram). ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతున్న ఈ సినిమాను 2024 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్, మహేశ్ బాబు లుక్స్ మాత్రం తెగ ట్రెండ్ అయ్యాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

49

Hanu Man
 
 ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‍లో వస్తున్న మరో చిత్రం హనుమాన్ (Hanu Man Movie). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, క్యారెక్టర్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక హనుమాన్ టీజర్ గ్లింప్స్ అయితే ఆదిపురుష్ విజువల్స్ కంటే మెరుగ్గా ఉన్నాయని టాక్ వచ్చింది. హనుమాన్ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న అంటే సంక్రాంతి బరిలో నిలిపారు.  

59


సైంధవ్

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం ‘సైంధవ్’. సైంధవ్ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రతి అప్‌డేట్ కోసం యూనిట్ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎస్.మణికందన్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.

69


ఈగల్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్ లు రెండు ప్లాఫ్ లు ఒక హిట్ అన్నట్లుంది. అయినా  హిట్లు ప్లాప్స్ అని చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాలు భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో  రవితేజ నటించిన మరో చిత్రం ఈగల్ (Eagle Movie) సంక్రాంతి బరిలోకి దిగనుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈగల్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించనుంది.

79


నా సామీరంగ
నాగార్జున (Nagarjuna) ఘోస్ట్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న  చేస్తున్న సినిమా నా సామిరంగ (Naa Saami Ranga). నాగ్ 99వ (Nag 99) చిత్రంగా వస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఆగస్ట్ 29న ఆయన పుట్టినరోజు (Nagarjuna Birthday) సందర్భంగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పాట సైతం రిలీజ్ చేసారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నా సామిరంగ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాదికి సంక్రాంతి బరిలో నిలిపారు మేకర్స్.  
 

89
sankranthi


ఇక ఈ సినిమాల్లో నా సామిరంగా, ఈగల్ చిత్రాలకు నాన్ థియేటర్ బిజినెస్ ఇంకా క్లోజ్ చేయలేదని తెలుస్తోంది. దాంతో సంక్రాంతికు వద్దామనే ఆలోచన ఉన్నా, అవి ఇంకా ఓ కొలిక్కి రాకుండా రిలీజ్ చేస్తే రిస్క్ తీసుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారట. నా సామిరంగా చిత్రం బిజినెస్ కు నాగ్ వరస డిజాస్టర్స్ ఇబ్బంది అవుతోందిట. రవితేజ ది కూడా సేమ్ సిట్యువేషన్ అంటున్నారు. ఓటిటి బిజినెస్ ఈ ఇద్దరికీ పడిపోయిందని,సినిమా హిట్ అయితేనే తీసుకుందామనే ఆలోచనతో ఓటిటి సంస్దలు ఉన్నాయట. దానికి తోడు చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వస్తాయా లేదా అనే డైలమో ఉందని ట్రేడ్ లో వినిపిస్తోంది. ఈగల్ సినిమా రిపబ్లిక్ డేకు వస్తే బెస్ట్ అని భావిస్తున్నారట. నా సామి రంగా మాత్రం ఎట్టి పరిస్దితుల్లో సంక్రాంతికి వస్తేనే బెస్ట్ అని నాగ్ చెప్తున్నారట. మరి ఏమి జరగనుందో చూడాల్సి ఉంది.

99
familystar


విజయ్ దేవరకొండ మూవీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రీసెంట్ గా ఖుషి (Kushi 2023) సినిమాతో పలకరించాడు. ఖుషి సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యింది. ఇదే కాకుండా మరో రెండు చిత్రాలను ప్లాన్ చేశాడు విజయ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటే.. పరుశురాంతో మరో మూవీ ఉంది. VD13, SVC54గా వస్తున్న విజయ్ దేవరకొండ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దామనున్నారు. పరుశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ జత కడుతోంది. మరో హీరోయిన్ కూడా ఇందులో కీ రోల్ చేస్తోంది. అయితే ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. ఇక్కడా ఓటిటి బిజినెస్ సమస్య అని తెలిసింది. 

click me!

Recommended Stories