విక్టరీవెంకటేశ్ (Venkatesh) నుంచి సంక్రాంతి బరిలో ‘సైంధవ్’ (Saindhav) వస్తోంది. శైలేష్ కొలను దీనికి దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెరేమియా, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ కీలక పాత్రలో నటించారు. జనవరి 13న మూవీ రిలీజ్ కాబోతోంది.