#Gunturkaaram మహేష్ పాత్ర పేరు, కథలో మెయిన్ పాయింట్ ఇదే?

Published : Jan 01, 2024, 04:25 PM IST

 ఈ సినిమాకు సంభందించిన స్టోరీ లీక్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అలాగే సినిమా మహేష్ పేరు కూడా బయిటకు వచ్చింది.  

PREV
19
#Gunturkaaram మహేష్ పాత్ర పేరు,  కథలో మెయిన్  పాయింట్ ఇదే?
GunturKaaram


సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో  ‘గుంటూరు కారం’చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.   మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగినట్లు సమాచారం. దాదాపు వందకోట్లు దాకా బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంభందించిన స్టోరీ లీక్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అలాగే సినిమా మహేష్ పేరు కూడా బయిటకు వచ్చింది.

29
#GunturKaaram


ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్ బాబు పేరు వెంకట రమణారెడ్డి అలియాస్ రవణ. గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. నలుగురికి సహాయం చేయడమే కాదు అలాగే అవసరమైతే లుంగి ఎగగట్టి ఫైట్ చేసేస్తూంటాడు. అతను బీడీ అంటించాడంటే అవతలి వాళ్లు కూసాలు, బీజాలు కదిలిపోవాల్సిందే. 

39


అతని మహేష్ తాతగా  ప్రకాష్ రాజు కనిపిస్తాడు. అతని పేరు వైరా వెంకట స్వామి. ఆయన జన దళం పార్టీ జనరల్ సెక్రటరీ. తన తాత ఎనభైవ పుట్టిన రోజు వెంకట రమణ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో కి ఊహించని విధంగా వస్తాడు. అప్పటిదాకా రాజకీయాలపై సెటైర్స్ వేసే రమణ ఎందుకు ,ఎలాంటి పరిస్దితుల్లో రాజకీయాల్లోకి వచ్చాడు, ఏం చేసాడు అనేది గుంటూరు కారం కథ గా చెప్తున్నారు. 
 

49
GunturKaaram


అలాగే ఈ సినిమాలో జగపతి బాబుతో   ఫైట్లు స్పెషల్ గా ఉంటాయిట. జగపతిబాబుతో బిజినెస్ లో వచ్చిన శత్రుత్వానికి, తన స్వంత ఫ్యామిలీలోని రాజకీయ అంశాలకు ముడిపెట్టిన తీరు డిఫరెంట్ గా ఉండటమే స్పెషాలిటీ అని చెప్తున్నారు. తాతయ్యగా ప్రకాష్ రాజ్, తల్లిగా రమ్యకృష్ణల పాత్రలు లీడ్ చేస్తాయని, వాటి ట్విస్టులు ఎమోషనల్ గా ఉంటాయని తెలిసింది. మొత్తానికి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ గా ఉంటుందట. ఫన్ తో కూడిన కొన్ని పొలిటికల్ సెటైర్స్ తో సినిమా ఉంటుందంటున్నారు.  అయితే ఇందులో నిజమెంత ఉంది అనేది సినిమా రిలీజ్ అయితేనే కానీ తెలియదు. అప్పటిదా ఇది ఊహాత్మక కథనం క్రింద భావించాల్సి ఉంటుంది. 

59
#GunturKaaram


సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్‌ను ఉద్దేశించి తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌ను ఆయన షేర్‌ చేశారు. ‘‘ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తాం. కంటెంట్‌ విషయంలో నేను నమ్మకంగా ఉన్నా’’ అని ఆయన చెప్పారు.

69

‘‘నేను ఇలా చెబితే బలుపు అనుకుంటారు కానీ ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తాం. అల వైకుంఠపురములో’ అలాగే జరిగింది. నేను విన్న కంటెంట్‌, తీసిన కంటెంట్‌ ఏంటో నాకు తెలుసు కదా! సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నా. మీకు మళ్లీ చెబుతున్నా. మేము అదే మాట మీద ఉన్నాం. ‘గుంటూరు కారం’ను భారీ స్థాయిలో విడుదల చేస్తాం. రిలీజ్‌ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

79

 

ఈ సినిమాకు సంబంధించి  ‘ఓ మై బేబి’ (Oh my Baby) పాట ఎన్ని విమర్శలను ఎదుర్కొందో తెలియంది కాదు. ఆ విమర్శలు తట్టుకోలేక.. పాట రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ప్రస్ట్రేషన్‌ని ప్రదర్శించారు. ఎలా గోలా ఆ పాట గొడవ సద్దుమణిగితే.. తాజాగా ఈ సినిమా నుండి మాస్ బీట్ ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madathapetti) సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ పాటపై కూడా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనే వస్తోంది. అయితే మహేష్ బాబు, శ్రీలీల (Sreeleela) డ్యాన్స్ స్టెప్స్‌పై మాత్రం అంతా పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు.  

89

 ఒకవైపు నెగిటివ్‌గా వినిపిస్తున్నా.. సాంగ్ మాత్రం యూట్యూబ్‌లో టాప్‌లో దూసుకెళుతూ.. నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. దాదాపు 24 గంటల్లో ఈ పాట ఒక కోటి వ్యూస్ రాబట్టే దిశగా వెళుతోంది. ఈ లెక్కన ఈ పాట హిట్టయినట్లే చెప్పుకోవాలి. 

99


  గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు  హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది..  అతడు, ఖలేజా  చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.  మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.

click me!

Recommended Stories