నాగార్జున, మహేశ్ బాబు, సూర్య, శ్రీకాంత్.. తమతో నటించిన హీరోయిన్లనే పెళ్లి చేసుకున్న హీరోలు వీళ్లే..

First Published | Jun 8, 2023, 10:03 PM IST

సూపర్ స్టార్ కృష్ణ నుంచి ఇప్పటి తరం హీరోల వరకు తమ సినిమాల్లో నటించిన హీరోయిన్లనే పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు ఎవరెవరు తమతో నటించిన హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారో తెలుసుకుందాం. 
 

సీనియర్ నటుడు, దివంగత సూపర్ స్టార్ కృష్ణ (Krishna) , నటి విజయ నిర్మల(Vijay Nirmala) ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 1969లో వీరి వివాహం జరిగింది. అప్పటికే మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవిని కృష్ణ పెళ్లిచేసుకున్నారు. అయితే విజయ నిర్మలను కృష్ణ 1967లో రూపుదిద్దుకున్న ‘సాక్షి’ మూవీ సెట్ లో తొలిసారిగా కలిశారు. ఆ తర్వాత రెండేళ్లకు పెళ్లి చేసుకున్నారు. వీరి జంటగా 40 సినిమాలు వచ్చాయి. ఇది ఇండస్ట్రీలో రికార్డు అని చెప్పొచ్చు. విజయ నిర్మల రెండేళ్ల కింద మరణిచగా.. కృష్ణ గతేడాది తుదిశ్వాస విడిచారు. 
 

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna)  కూడా తన సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలను పెళ్లి చేసుకున్నారు. 1992లో వీరికి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అంతకు ముందే నాగార్జునకు లక్ష్మి దగ్గుబాటితో వివాహం జరిగింది. డివోర్స్ తర్వాత అమలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో కిరాయి దాదా, చిన్నబాబు, శివ, ప్రేమ యుద్ధం, సంభవం వంటి చిత్రాలు వచ్చాయి. 
 


ఎన్నో చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్. అయితే 1987లో వచ్చిన ‘తలంబ్రాలు’ చిత్రంతో రాజశేఖర్ - జీవితా కలిసి నటించారు. ఆ సినిమాతోనే వీరి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 1991లో జీవితను పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్ - జీవిత దంపతులు ఏ ఈవెంట్ లోనైనా కలిసే హాజరవుతూ సందడి చేస్తుంటారు. 
 

ఒకప్పటీ లవర్ బాయ్, సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) కూడా తన తోటి నటినే పెళ్లిచేసుకున్నారు. తమిళ నటి ఊహాను 1997లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరి జోడిగా ఆమె, ఆయనగారు, కూతురు, పాత బస్తీ వంటి చిత్రాలు వచ్చాయి. 
 

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ జంటగా ‘వంశీ’ చిత్రంతో అలరించారు. ఈ సినిమా వచ్చిన ఐదేళ్ల తర్వాత 2005లో పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత నమ్రతా పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వారి బిజినెస్ లు చూసుకుంటున్నారు. 
 

తెలుగు నటుడు ఆది పినిశెట్టి (Aadhi Pinishetty)  కూడా తనతో కలిసి నటించిన హీరోయిన్ నిక్కీ గర్లానీని పెళ్లిచేసుకున్నారు. గతేడాదే వీరి మ్యారేజ్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరూ జంటగా మరగద నానయమ్, శివుడు, యుగవరయినమ్ నా కాక్క చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 
 

హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ నటి వితికా శేరూ ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ‘పడ్డనండి ప్రేమలో మరీ’ చిత్రంతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దికాలనికే పెళ్లి చేసుకున్నారు. వీరి మ్యారేజ్ 2016లో ఘనంగా జరిగింది. 
 

ప్రస్తుతం  టాలీవుడ్ లో వెండితెరపై అలరించిన మరో కొత్త జంట ఒకటి కాబోతోంది. అదేవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. జూన్ 9న వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరగబోతోందని విశ్వసనీయ సమాచారం. వీరిద్దరూ జంటగా ‘అంతరిక్షం’ చిత్రం వచ్చింది. 
 

తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు సూర్య  కూడా తన తోటి నటి జ్యోతికను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006లో వీరి మ్యారేజ్ జరిగింది. సూర్య - జ్యోతిక జంటగా చాలా సినిమాల్లో నటించారు.

Latest Videos

click me!