సౌందర్య నిర్మించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? తండ్రి కోసం సాహసం, ఏకంగా రెండు జాతీయ అవార్డులు

First Published | Oct 10, 2024, 6:10 PM IST

సౌందర్య ఎన్నో సినిమాలు చేసింది, నటిగా మెప్పించింది. కానీ ఆమె ఒకే ఒక్క సినిమా నిర్మించింది. దాని వెనుక తండ్రి సెంటిమెంట్‌ ఉండటం విశేషం. ఆ కథేంటో చూస్తే, 
 

సౌందర్య తెలుగు హీరోయిన్లలో ఆమెది ప్రత్యేక స్థానం. ఎవర్‌ గ్రీన్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు సహజనటిగానూ ఆమె పాపులర్‌ అయ్యింది. సౌందర్యం ఎంత అందంగా ఉంటుందో, ఆమె నటన అంతకు మించిన అందంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మిడిల్‌ క్లాస్‌ ఉమెన్‌ పాత్రలతో ఆమె మెప్పించి బాగా ఆదరణ పొందింది. దశాబ్దం పాటు తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఆమె పుట్టింది పెరిగింది కర్నాటక అయినా, తెలుగమ్మాయిగా పేరుతెచ్చుకుంది. ఇక్కడ ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సౌందర్య.. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె నాన్న సత్యనారాయణ అయ్యర్‌ కన్నడలో రైటర్‌గా, నిర్మాతగా రాణించారు. పలు సినిమాలు నిర్మించారు. రైటర్‌గానూ పనిచేశారు. తండ్రి కారణంగానే సినిమాల్లోకి వచ్చింది సౌందర్య. ఓ మూవీలో చిన్న పాత్ర కోసం ఓ అమ్మాయి కావాలంటే తన కూతురు ఉంది కదా అని సౌందర్యని స్కూల్‌ నుంచే తీసుకెళ్లారట. అప్పటికీ సౌందర్యకి సినిమాలంటే ఇష్టం లేదు.

మొదట్లో వ్యతిరేకించింది కూడా, కానీ మరో ప్రత్యామ్నాయం లేక సౌందర్యని నటిగా మార్చాల్సి వచ్చింది. అందులో ఆమెది కాసేపు కనిపించే పాత్రనే పెద్దగా ప్రయారిటీ లేదు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో చదువు పక్కన పెట్టి సినిమాల్లోకి వచ్చేసింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె చదువుని పూర్తిగా వదిలేసింది. 
 


తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఆమె కెరీర్‌ మారిపోయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో బిజీ అయ్యింది. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయాల్సి వచ్చింది. దీంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరోయిన్‌గా పీక్‌లో ఉన్న సమయంలోనే సౌందర్య నాన్న చనిపోయాడు. ఆయన హఠాన్మరణంతో సౌందర్య కుంగిపోయింది. చాలా డిస్టర్బ్ అయ్యింది.

ఈ క్రమంలో తనకు ఓ ఆలోచన వచ్చింది. నాన్న కోసం ఏదైనా చేయాలనిపించింది. ఈక్రమంలోనే ఆమె నిర్మాతగా మారింది. నాన్నకి ట్రిబ్యూట్‌గా సినిమా చేయాలని నిర్ణయించుకుంది. నాన్న పేరుతోనే బ్యానర్‌ని లాంఛ్‌ చేసింది. 
 

సౌందర్య `సత్య మూవీ మేకర్స్` పేరుతో కొత్తగా నిర్మాణ సంస్థని ప్రారంభించి 2002లో `ద్వీప` అనే సినిమాని నిర్మించింది. ఇది కన్నడలో తెరకెక్కిన చిత్రం. దీనికి గిరీష్‌ కాసరవల్లి దర్శకుడు. ఫీమేల్‌ ఓరియెంటెడ్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇందులో లీడ్‌ రోల్‌లో సౌందర్యనే నటించడం విశేషం. పేదల జీవితాలను ఆవిష్కరించే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్‌గా ఫర్వాలేదనిపించింది.

కానీ పెద్ద హిట్‌ కాదు. కానీ ఫర్వాలేదనిపించుకుంది. క్రిటిక్స్ మన్ననలు పొందింది. తండ్రికి నిర్మాతగా ఓ ట్రిబ్యూట్‌ ఇచ్చింది. అయితే ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం విశేషం. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా, అలాగే కెమెరా వర్క్ లో మరో జాతీయ అవార్డుని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ప్రొడక్షన్‌ చేయలేదు సౌందర్య. 
 

సౌందర్య చివరగా `శివ శంకర్‌` చిత్రంలో నటించింది. మోహన్‌బాబుకి జోడీగా చేసింది. ఈ సినిమా ఆడలేదు. ఆమె నటించిన `నర్తనశాల` మధ్యలోనే ఆగిపోగా, నాలుగేళ్ల క్రితం ఓటీటీలో విడుదల చేశారు. ఇక సౌందర్య 2004లో ఎన్నికల ప్రచారం కోసం హెలికాఫ్టర్‌లో ట్రావెల్‌ చేస్తుండగా, ఆ ప్రమాదంలో సౌందర్య చనిపోయారు. అందులో తన సోదరుడు అమర్నాథ్‌ కూడా ఉండటం విచారకరం. 

Also read: చిరంజీవి ఆ రోజు మాత్రం నేలమీదనే పడుకుంటాడు, ఎందుకో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు
read more: రజనీకాంత్‌ `వేట్టయన్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

Latest Videos

click me!