ఐశ్వర్యరాయ్ ని మహేష్ కూతురు ఎలా డామినేట్ చేసిందో తెలుసా.. నయనతార, రేఖ, జ్యోతిక అంతా ఇక్కడే..వైరల్ ఫొటోస్

Published : Jul 14, 2024, 04:59 PM IST

మహేష్ కూతురు సితార.. ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్యతో కలసి తీసుకున్న సెల్ఫీ తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో సితార.. ఐష్ ని డామినేట్ చేసేలా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

PREV
16
ఐశ్వర్యరాయ్ ని మహేష్ కూతురు ఎలా డామినేట్ చేసిందో తెలుసా.. నయనతార, రేఖ, జ్యోతిక అంతా ఇక్కడే..వైరల్ ఫొటోస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రత, కుమార్తె సితారతో కలసి అనంత్ అంబానీ వెడ్డింగ్ కి హాజరైన సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుక అంబరాన్ని అంటేలా సాగింది. అంబానీ ఇంట పెళ్లి వేడుక అంటే ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది. 

26

ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు హాజరయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. రాజకీయ నేతలు, క్రీడా ప్రముఖులుకూడా అనంత్ అంబానీ వెడ్డింగ్ కి వెళ్లారు. పెళ్లి వేడుకలో సందడి మొత్తం సినీ సెలెబ్రిటీలదే. 

36

ముఖ్యంగా హీరోయిన్లు, స్టార్ హీరోల సతీమణులు, వాళ్ళ కుమార్తెలు అందమైన కాస్ట్యూమ్స్ తో మెరిశారు. మహేష్ బాబు కుమార్తె సితార ఆల్రెడీ సోషల్ మీడియా క్వీన్ గా మారిపోయింది. అంబానీ పెళ్లి వేడుకలో సైతం సితార అందరిని ఆకర్షించింది. 

46

నమ్రత, మహేష్, సితార అంబానీ పెళ్లి వేడుకలో పలువురు స్టార్స్ తో కనిపించారు. ఆ ఫోటోలని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో అందరికంటే సితార ఆకర్షించేలా క్యూట్ లుక్స్ తో మెరిసింది. సితార, నమ్రత.. ఐశ్వర్యారాయ్ ఆమె కుమార్తె ఆరాధ్యతో కలసి సెల్ఫీకి ఫోజు ఇచ్చారు. ఈ ఫొటోలో ఐశ్వర్య రాయ్, ఆరాధ్య తల్లీకూతుర్లు ఇద్దరినీ నమ్రత తన క్యూట్ లుక్స్ తో డామినేట్ చేస్తూ కనిపించింది. 

56

ఫాన్స్ కూడా ఆ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్, ఆరాధ్యని మించేలా మహేష్ కూతురు వెలిగిపోతోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా నమ్రత, సితార లెజెండ్రీ నటి రేఖతో కూడా సెల్ఫీ తీసుకున్నారు. 

66

సూర్య సతీమణి జ్యోతిక, లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలసి నమ్రత ఫోజులు ఇచ్చింది. స్టన్నింగ్ అనిపించేలా ఉన్న ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే రాబోయే రోజుల్లో సితార హీరోయిన్లందరిని డామినేట్ చేసేలా కనిపిస్తోంది. నటి కావడం తనకి చాలా ఇష్టం అని ఆల్రెడీ సితార ప్రకటించేసింది. 

click me!

Recommended Stories