మామ అల్లుళ్ళు పని పూర్తి చేశారు..ఇక మిగిలింది చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ

Published : Feb 19, 2025, 09:13 PM IST

చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులు సహజం. ఫ్లాప్ చిత్రం ఎదురైనప్పుడు నెక్స్ట్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలని ప్రతి హీరో గట్టిగా ప్రయత్నిస్తారు. వరుసగా పరాజయాలు ఎదురైతే మార్కెట్ దెబ్బ తింటుంది.

PREV
16
మామ అల్లుళ్ళు పని పూర్తి చేశారు..ఇక మిగిలింది చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ
Naga Chaitanya, Venkatesh

చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులు సహజం. ఫ్లాప్ చిత్రం ఎదురైనప్పుడు నెక్స్ట్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలని ప్రతి హీరో గట్టిగా ప్రయత్నిస్తారు. వరుసగా పరాజయాలు ఎదురైతే మార్కెట్ దెబ్బ తింటుంది. టాలీవుడ్ లో ఈ ఏడాది కంబ్యాక్ ఇవ్వాల్సిన హీరోలు కొంతమంది ఉన్నారు. 

26
Sankranthiki Vasthunam

రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ఈ ఏడాది సూపర్ కంబ్యాక్ ఇచ్చేశారు. గత ఏడాది విక్టరీ వెంకటేష్ కి సైంధవ్ అనే చిత్రంతో దారుణమైన డిజాస్టర్ ఎదురైంది. ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకీ బాక్సాఫీస్ దద్దరిల్లేలా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. రీజినల్ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్ అన్నంత రేంజ్ లో ఈ మూవీ 300 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. 

36
thandel movie

నాగ చైతన్య చివరగా నటించిన థాంక్యూ, కస్టడీ చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్ర బడ్జెట్ లెక్కలు పక్కన పెడితే బయ్యర్లు మాత్రం లాభాలు అందుకుంటున్నారు. ఈ చిత్రంతో చైతూకి కూడా మంచి పేరు వచ్చింది. సో మామ అల్లుళ్ళు వెంకీ, చైతు ఇద్దరూ కంబ్యాక్ ఇచ్చెసినట్లే. ఈ ఏడాది విజయాలు బాకీ ఉన్న హీరోలు కొందరు ఉన్నారు. రానున్న సమ్మర్ లో, సమీప భవిష్యత్తులో వారి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. 

46
Hari Hara Veera Mallu

టాలీవుడ్ లో నెక్స్ట్ కంబ్యాక్ ఇవ్వవలసిన హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో నితిన్. పవన్ కళ్యాణ్ చివరగా నటించిన బ్రో చిత్రం ఫ్లాప్ అయింది. నితిన్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. సమ్మర్ లో పవన్ నటించిన హరి హర వీరమల్లు, నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీళ్ళిద్దరూ ఈ చిత్రాలతో హిట్స్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

56
Vishwambhara

ఆ తర్వాత రేసులో ఉన్నది రవితేజ. మాస్ మహారాజ్ కి గత ఏడాది కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ రూపంలో ఎదురైంది. సమ్మర్ లో రవితేజ నుంచి మాస్ జాతర చిత్రం రానుంది. ధమాకా తర్వాత మరోసారి రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. చిరు నటిస్తున్న విశ్వంభర చిత్రం జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సమ్మర్ లో లాస్ట్ పంచ్ విజయ్ దేవరకొండదే కావచ్చు. విజయ్ దేవరకొండ చివరగా నటించిన ఫ్యామిలీ స్టార్ దారుణంగా ఫెయిల్ అయింది. 

66
Vijay Deverakonda Kingdom movie

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 30 న రిలీజ్ అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఇటీవల విడుదలైన టీజర్ అదిరిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ హిట్ అయితే విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇవ్వడంతో పాటు ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories