16 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోయిన్, అదే తెలుగు హీరోతో 40 ప్లస్ లో మరో సూపర్ హిట్

Published : Feb 19, 2025, 07:06 PM IST

టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. రమ్యకృష్ణ లాంటి వారైతే ఇప్పటికీ అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. త్రిష, కాజల్ చాలా సుదీర్ఘంగా కెరీర్ కొనసాగిస్తున్నారు.

PREV
15
16 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోయిన్, అదే తెలుగు హీరోతో 40 ప్లస్ లో మరో సూపర్ హిట్
Meena

టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. రమ్యకృష్ణ లాంటి వారైతే ఇప్పటికీ అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. త్రిష, కాజల్ చాలా సుదీర్ఘంగా కెరీర్ కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించి ఎక్కువ కాలం కొనసాగిన హీరోయిన్లలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనా టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయింది. 

25

మీనాకి 15 ఏళ్ళ వయసులోనే సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం మీనా కెరీర్ ని మార్చేసింది. 1991లో విడుదలైన సీతారామయ్యగారి మనవరాలు చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. ఆ మరుసటి ఏడాది మీనా నుంచి మరో సంచలనాత్మక చిత్రం వచ్చింది. అదే విక్టరీ వెంకటేష్ తో కలసి నటించిన చంటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. దీనితో చంటి మూవీ రికార్డులు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

35
meena

16 ఏళ్ళ వయసులోనే మీనా ఖాతాలో ఇండస్ట్రీ సక్సెస్ పడింది. దీనితో ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. దీనితో నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. ఇప్పటికీ మీనా నటిగా రాణిస్తున్నారు. 

45

16 ఏళ్ళ వయసులో వెంకటేష్ కి హీరోయిన్ గా నటించిన మీనా.. తనకి 44 ఏళ్ళ వయసొచ్చిన తర్వాత కూడా వెంకీకి హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ అందుకుంది. వీరిద్దరూ చివరగా దృశ్యం 2 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

55
Drushyam 2 Telugu Movie

మీనా, వెంకటేష్ లది సూపర్ హిట్ పెయిర్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చంటి, సుందరకాండ, సూర్య వంశం, అబ్బాయిగారు, దృశ్యం 1, దృశ్యం 2 చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 

Read more Photos on
click me!

Recommended Stories