చిరంజీవితో రొమాన్స్ చేసిన స్టార్ హీరోల భార్యలు ఎవరెవరో తెలుసా, అక్కాచెల్లెళ్లు కూడా..
అప్పట్లో చిరంజీవితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన హీరోయిన్లు కొంతమంది ప్రస్తుతం స్టార్ హీరోల భార్యలు అనే సంగతి తెలుసా. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
అప్పట్లో చిరంజీవితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన హీరోయిన్లు కొంతమంది ప్రస్తుతం స్టార్ హీరోల భార్యలు అనే సంగతి తెలుసా. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవితో డ్యాన్స్ చేయడం అంటే హీరోయిన్లకు సవాల్. చిరు డ్యాన్స్ వేగాన్ని మ్యాచ్ చేయలేక ఇబ్బంది పడ్డాం అని చాలా మంది నటీమణులు చెబుతుంటారు. కొందరు హీరోయిన్లు మాత్రం చిరంజీవి పక్కన డ్యాన్స్ చేస్తుంటే అభిమానులకు చూడముచ్చటగా అనిపించేది. రాధా, విజయశాంతి, శ్రీదేవి లాంటి హీరోయిన్స్ చిరంజీవి పక్కన జోడిగా బావుండేవారు. అప్పట్లో చిరంజీవితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన హీరోయిన్లు కొంతమంది ప్రస్తుతం స్టార్ హీరోల భార్యలు అనే సంగతి తెలుసా. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
రాధిక, చిరంజీవిలది అప్పట్లో తిరుగులేని పెయిర్. అభిలాష, ఆరాధన, న్యాయం కావాలి, దొంగ మొగుడు ఇలా చాలా చిత్రాల్లో రాధిక, చిరంజీవి కలసి నటించారు. అప్పట్లో వీరిద్దరి జోడి సిల్వర్స్ స్క్రీన్ పై గమ్మత్తుగా ఉండేది. 2001లో రాధికా.. హీరో శరత్ కుమార్ ని వివాహం చేసుకున్నారు. శరత్ కుమార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇది రాధికకి మూడో వివాహం.
కన్నడ దిగ్గజ నటుడు అంబరీష్ సతీమణి సుమలత కూడా చిరంజీవితో కొన్ని చిత్రాల్లో నటించారు. చిరంజీవి ఫ్యామిలీ, సుమలత ఫ్యామిలీ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఖైదీ, చట్టంతో పోరాటం, శుభలేఖ లాంటి చిత్రాల్లో చిరంజీవి, సుమలత నటించారు. 1990లో చిరంజీవి నటించిన రాజా విక్రమార్క చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో చిరంజీవికి జోడిగా అమల హీరోయిన్ గా నటించడం విశేషం. ఈ చిత్రం విడుదలైన రెండేళ్ళకి నాగార్జున , అమల వివాహం చేసుకున్నారు.
హీరోయిన్ నిరోషా కూడా చిరంజీవితో నటించింది. వీళ్ళిద్దరూ కలసి నటించిన చిత్రం స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్. 90వ దశకంలో ఫీల్ గుడ్ మూవీస్ తో అలరించిన హీరో రాంకీని నిరోషా 1995లో వివాహం చేసుకుంది. మరో విశేషం ఏంటంటే హీరోయిన్ రాధికా, నిరోషా రియల్ లైఫ్ లో అక్కా చెల్లెళ్ళు.
చిరంజీవితో జ్యోతిక బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్ లో నటించారు. అగ్ర హీరో సూర్యని జ్యోతిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జ్యోతిక అప్పటి స్టార్ హీరోయిన్ నగ్మాకి చెల్లి అవుతుంది. నగ్మా, చిరంజీవి కలసి ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో నటించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి చివరగా నటించిన తెలుగు చిత్రం అంజి. చిరంజీవి, నమ్రత కలసి నటించిన ఈ మూవీ సక్సెస్ కాలేదు. కానీ ఆ చిత్రంలో గ్రాఫిక్స్ ని ఇప్పటికీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు.