రామ్ చరణ్ కోసం నాని తప్పుకుంటాడా? వేరే ఆప్షన్ లేదా
రామ్ చరణ్ సినిమాతో నాని పోటీపడడనేది నిజం. దానికి తోడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని త్వరలో చిరంజీవితో ఒక సినిమా నిర్మించనున్నాడు.
రామ్ చరణ్ సినిమాతో నాని పోటీపడడనేది నిజం. దానికి తోడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని త్వరలో చిరంజీవితో ఒక సినిమా నిర్మించనున్నాడు.
పెద్ద సినిమాలు షూటింగ్ మొదలెట్టక ముందే రిలీజ్ డేట్ ఎప్పుడు, ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేయాలి అనే విషయంలో క్లారిటీతో ఉంటున్నాయి. ఆ మేరకు ప్రకటనలు కూడా చేస్తున్నాయి.
అయితే రకరకాల కారణాలతో సదరు సినిమాలు మొత్తం వాటిని బేస్ చేసుకుని రిలీజ్ లు పెట్టుకున్న సినిమాలన్నీ డిస్ట్రబ్ అవుతాయి. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ ప్లాన్ తో నాని సినిమా ప్రక్కకు వెళ్లేలా కనపడుతోంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని “ది ప్యారడైజ్” అనే సినిమాని ఇటీవల ప్రకటించాడు. ఈ సినిమాని మార్చి 26, 2026న విడుదల చేస్తానని చెప్తూ ఒక టీజర్ కూడా విడుదల చేశాడు నాని. కానీ ఇప్పుడది వాయిదా పడేలా ఉందని వార్తలు వస్తున్నాయి.
నాని ప్లాన్ చేసిన రిలీజ్ డేట్ ఫెరఫెక్ట్. మార్చి 2026 చివరి వారంలో ఉగాది, రంజాన్ వస్తున్నాయి. దాదాపు నాలుగు, ఐదు రోజుల సెలవు దినాలు ఉంటాయి.
దాంతో ఈ రోజులని టార్గెట్ చేస్తూ తాజాగా కన్నడ సూపర్ స్టార్ తన “టాక్సిక్” సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా మార్చి 19, 2026న విడుదల కానుంది.
మరో ప్రక్క రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న స్పోర్ట్స్ చిత్రం ‘పెద్ది’ నిమార్చి 26, 2026న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు అని టాక్. ఈ విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
రామ్ చరణ్ సినిమా కనుక నిజంగా మార్చి 26, 2026న వస్తే నాని సినిమాని వాయిదా వెయ్యక తప్పదు. రామ్ చరణ్ సినిమాతో నాని పోటీపడడనేది నిజం.
దానికి తోడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని త్వరలో చిరంజీవితో ఒక సినిమా నిర్మించనున్నాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ సినిమా నిజంగా మార్చి 26న వస్తుందా రాదా అనే విషయం తేలాకే నాని నిర్ణయానికి వస్తాడని ట్రేడ్ అంటోంది.
ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. ప్రస్తుతం నాని “హిట్ 3” సినిమా విడుదల, ఆ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.