పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు... నటుడుగా తానేమిటో పసిప్రాయంలోనే మహేష్ నిరూపించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ఏకైక నటుడు మహేష్ బాబు. టీనేజ్ లోనే మహేష్ సోలో హీరోగా సినిమాలు చేశాడు. అలాగే అన్న, నాన్నలతో కలిసి మల్టీస్టారర్స్ లో నటించారు.
ఇక చెన్నైలో పుట్టి పెరిగిన మహేష్ కి తెలుగు చదవడం, రాయడం రాదు. ఆయనకు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉంది. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలిగిన మహేష్ బాగా రాయగలరు. ఇక మహేష్ కి కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ క్లాస్ మేట్స్ కావడం విశేషం.